కట్నం తీసుకునేవాడు గాడిద అని టీవీ9 లోగోలోనే పట్టేవారు. దాన్ని చూసి అందరూ సెటైర్లు వేసేవారు. తర్వాత సందర్భానికి తగ్గట్లుగా మార్చుతున్నారు. తాజాగా సోషల్ సైకోలంటే పరమ అసహ్యమని వారిని వెలివేయాలన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అది బయటకే … కానీ అరెస్టు అయిన వారు చాలా బుద్దిమంతులని ప్రభుత్వం వారిని వేధిస్తోందన్నట్లుగా వార్తలు రాయడానికి.. చూపించడానికి చచ్చు తెలివి తేటలు మాత్రం ప్రదర్శిస్తూనే ఉన్నారు.
వర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరి రవికిరణ్ అనేవ్యక్తులు పెట్టిన పోస్టుల గురించి ఎప్పుడూ ఒక్క వార్త రాయలేదు కానీ.. వారికి మద్దతుగా వైసీపీ నుంచి ఎవరు మట్లాడినా టీవీ9 చూపించేస్తుంది. ఆయనపై ఓ పది ఇరవై కేసులు పెట్టి తిప్పుతున్నారని.. ఆ వైసీపీ నేతల బాధను తన బాధగా చూపిస్తుంది. సోషల్ మీడియా సైకోలను సమాజం నుంచి వెలివేయాలంటే.. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన వారు ఎంత తప్పు చేశారో టీవీ9 చూపించాలి కదా. జనాలకు చెప్పాలి కదా!
వాళ్లేదో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేశారన్నట్లుగా తమ టీవీని చూసేవారిని నమ్మించడానికి టీవీ9 నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. జగన్ రెడ్డి ఎక్కడా కనిపించకపోయినా.. ఆయనకు మైలేజీ వచ్చేందుకు ఏమి చేస్తే బాగుంటుందా అని వెదుక్కుని కథనాలు రాస్తుంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పల్నాడుకుపదవులు ఇవ్వలేదా.. కోస్తాకు ప్రాజెక్టుల్లేవా.. ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత లేదాఅనే కబుర్లు మాత్రం చెప్పడానికి రెడీ అవుతుంది.
జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క టీడీపీ కారక్రమానికి కవరేజీ లేదు. అదే లోకేష్ పై తప్పుడు ప్రచారం చేయడానికి, కించపర్చడానికి మాత్రం గంటలు గంటలు కేటాయించేవారు. వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న టీవీ9కి సరైన బుద్దిగా చెప్పాలని సగటు టీడీపీ కార్యకర్త కోరుకుంటున్నాడు.