ఏపీలో ఇళ్లు కట్టుకునేవారికి ప్రభుత్వం ఊహించనంత వెసులుబాటు కల్పించింది. భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం వెలువరించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలపై వేసిన కమిటీ నివేదికకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో భూముల ధరలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కూటమి ప్రభుత్వం ఆశిస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలపై కమిటీ సంపూర్ణంగా అధ్యయనం చేసింది.
15 మీటర్ల ఎత్తు వరకూ భవనాల నిర్మాణాల ప్లాన్ లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదు.రాష్ట్రంలో వచ్చేనెల 31 నుండి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను మరింత సులభతరం చేయడం ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేదుంకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ అనుమతులను వేగవంతంగా సులభంగా ఇచ్చే అంశంపై మున్సిపల్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
భవన నిర్మాణ అనుమతులకై నిర్మాణదారులు వివిధ శాఖల అనుమతులకై రెవెన్యూ,రి జిష్ట్రేషన్ అండ్ స్టాంప్స్,అగ్నిమాపక శాఖలతో పాటు గనులు, రైల్వే, విమానాశ్రయ ప్రాంతాల సమీపంలో అయితే ఆయా శాఖల చుట్టూ అనుమతుల కోసం తిరగాల్సి వస్తోది. వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని అనుమతులు ఒకేచోట సింగిల్ విండో విధానంలో పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. లైసైన్డు సర్వేయర్లు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆన్లైన్లో అప్లై చేస్తే అందుకు సంబంధించిన అనుమతులను సకాలంలో మంజూరు చేస్తారు.