జగన్ రెడ్డిని నమ్ముకుంటే జీవితాంతం కూడబెట్టుకున్న పేరు, ప్రతిష్టలను కూడా పణంగా పెట్టాలని మరో సీనియర్ జర్నలిస్టుకు అర్థమైపోయింది. ఆయన పేరు విజయ్ బాబు. జగన్ రెడ్డి కొన్నాళ్ల పాటు సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవి ఇచ్చారని ఆయన కోసం ఇష్టం వచ్చినట్లుగా పిల్స్ వేయడం ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టినందున అరెస్టులు చేస్తున్నారని వాటిని ఆపాలని ఆదేశాలివ్వాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింద. బలహీనులైన ప్రజల కోసం దాఖలు చేయాల్సిన ఈ పిల్‌ను రాజకీయ అవసరం కోసం దుర్వినియోగం చేశారని మండిపడింది. ఫైన్ విధించింది. లీగల్ సెల్ అధారిటీకి ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. వాక్ స్వేచ్చ వేరు అని.. ఇతరులపై అసభ్యంగా విరుచుకుపడటం వేరు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా బూతులతో , మార్ఫింగ్‌లతో విరుచుకుపడుతున్న వారికి అత్యంత ఖరీదైన ఫోన్లు, గాడ్జెట్లు ఉంటున్నాయన్నారు.
విజయ్ బాబు తన సర్వీస్ మొత్తం జర్నలిజం చేశారు. తర్వాత జనసేనలో చేరారు. జనసేన ఓడిపోయిన తర్వాత జగన్ పంచన చేరారు. అప్పట్నుంచి టీవీ చానళ్లలో జగన్ కోసం అడ్డగోలుగా మాట్లాడి తన గౌరవాన్ని తగ్గించుకున్నారు. ఇప్పుడు రాజకీయ కారణాలతో పిల్ వేశారని కోర్టుకు జరిమానా కట్టాల్సి వచ్చింది.