అమెరికా ఎఫ్బీఐ జగన్ చేసిన లంచాల బాగోతంపై గుట్టు బయటపెట్టిన వారం రోజుల తర్వాత స్పందించారు. ప్రెస్మీట్ మొత్తం మీద తాను చంద్రబాబు హయాం కంటే తక్కువ మొత్తానికి ఒప్పందం చేసుకున్నానని వాదించారు. అమెరికా ఎఫ్బీఐ కేసు గురించి తెలియదని.. అందులో తన పేరు ఎక్కడా లేదని.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. వంద కోట్లకు కాకపోతే రూ.1750 కోట్లకు పరువు నష్టం వేసుకోవచ్చు కానీ.. ఎఫ్బీఐ చార్జిషీట్లో అప్పటి ఏపీ సీఎం చాలా స్పష్టంగా ఉంటే.. తన పేరు లేదని జగన్ బుకాయించారు.
వారం రోజులు వైసీపీతో పాటు సాక్షి పదే పదే ప్రచారం చేస్తున్న విషయాలను చెప్పడానికే జగన్ ప్రెస్మీట్ పెట్టారు. చంద్రబాబు ఎక్కువ ధరకు కొన్నారని తాము తక్కువ ధరకు కొన్నామని సన్మానం చేయాల్సింది పోయి బురద చల్లుతారా అంటూ బాధపడిపోయారు. తక్కువ ధరకు కొంటే నిజంగానే సన్మానం చేసేవాళ్లు కానీ అక్కడ చేసిన స్కాం కళ్ల ముందే ఉన్నా.. ఎదురుదాడికి దిగితే.. ఆ వినేవాళ్లను పిచ్చివాళ్లను చూస్తే.. ఎలా సన్మానం చేస్తారు.
కరెంట్ చార్జీల విషయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఆరోపణలతో .. పీపీఏల్ని రద్దు చేయడమే కాకుండా ఇరవై ఏళ్ల పాటు ఎవరైనా ఒప్పందాలు చేసుకుంటారా అని దీర్ఘాలు తీశారు. ఇప్పుడు సెకీ పేరుతో పాతికేళ్ల పాటు ఒప్పందాలు చేసుకున్నారు. జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడల్లా తానేదో పగిలిపోయే మేలు చేశానని మీకే తెలియడం లేదని ఎదురుదాడి చేస్తున్నారు.కానీ అసలు నిజం కళ్ల ముందు ఉంటే.. ఆయన మాటల్ని ఎవరు నమ్ముతారు.