తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కేటీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులు చట్టానికి లోబడి పని చేస్తారని వారి పనిని ప్రభావితం చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాని స్పష్టం చేసింది. కేటీఆర్ రెండు రోజుల కిందట సిరిసిల్లకు వెళ్లారు. అక్కడ తాను మంచి వాడిని కాదని చెప్పేందుకు ఆవేశపెడ్డారు. కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ బీఆర్ఎస్ నేతల్ని పార్టీ మారాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము వచ్చిన సంగతి చూస్తామన్నారు. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారని మండిపడ్డారు.
కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ జిల్లాకు అధికారి అయిన ఐఏఎస్‌పై ఓ రాజకీయ నాయకుడు ఇలాంటి కామెంట్లు చేయడం అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా ఉందన్న అభిప్రాయం ఉంది. ఆయనకు మద్దతుగా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లలో ఐక్యత లేదనుకుంటారని రేపు మరికొందరిపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారన్న కారణంగా అసోసియేషన్ స్పందించింది. కేటీఆర్ తక్షణం సారీ చెప్పాలని .. తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
కలెక్టర్లు అయినా ఎస్పీలు అయినా ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి ఫేవర్ గా నిర్ణయాలు అమలు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది నిబంధనలకు అనుగుణంగా ఉంటే చేయక తప్పదు. బీఆర్ఎస్ హయాంలోనూ కలెక్టర్లు అదే చేశారు. ఇంకా చెప్పాలంటే అంతకు మించి చేశారు. అందుకే సిద్దిపేట లో కలెక్టర్లుగా చేసిన వాళ్లు ఎమ్మెల్సీలు అయ్యారు. ఎంపీ టిక్కెట్లు కూడా సాధించారు. ఇది తెలిసి కూడా కలెక్టర్లను బెదిరించాలని కేటీఆర్ అనుకున్నారు.