పోలీసులు అరెస్టు చేస్తామని చెప్పలేదు. కేవలం విచారణకు పిలిచారు. దానికి వెళ్లకుండా ఆర్జీవీ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియకుండా..కోర్టుల్లో పిటిషన్లు వేసుకుని మీడియా ముందు చట్టాలు, న్యాయాల గురించి చాట భారతాలు చెబుతున్నారు. అవన్నీ ఆయన చెప్పే ఫిలాసఫీకి చాలా దూరంగా ఉన్నాయి. ఇదంతా కాదు ముందు పోలీసుల ముందు హాజరవుతావా లేదా అన్నదే చట్టం చూస్తుంది. ఎందుకంటే పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత సహకరించాలి. వారం గడువు అడిగిన తర్వాత కూడా మళ్లీ పోలీసుల ముందు హాజరు కాకుండా.. కేసులు,సెక్షన్లు అంటూ కబుర్లు చెప్పడం ఎందుకు?
ఆర్జీవీకి ఇష్టమైన సబ్జెక్ట్ క్రైమ్. దావూద్ దగ్గర నుంచి ఆయన చాలా మందిని దగ్గరగా చూశారు. ఇప్పుడు ఎందుకు ఒక్క కానిస్టేబుల్ ఎదురుపడితే భయపడిపోతున్నారు ?. చట్టాలను చట్టాలుగా చూసేవారంటే ఆర్జీవీకి చాలా చులనక . అయినా ఇప్పుడు తనకు చాలా చట్టాలు వర్తిస్తాయని.. చాలా హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. ఆర్జీవీకి ఉన్న హక్కులే.. .ఆయన ఎవరిపై నోరు పారేసుకున్నారో.. డబ్బులకు కక్కుర్తి పడి ఎవరి కుటుంబాలపై తప్పుడు ప్రచారం చేశారో వారందరికీ ఉంటాయి. మనోభావాల కేసా లేకపోతే ప్రభుత్వం వద్ద డబ్బులు తీసుకున్నా కేసా.. అన్నది తర్వాత తేలుతుంది..ముందు నోటీసులు ఇచ్చినప్పుడు పోలీసుల ఎదుట హాజరవ్వాలా వద్దా అన్నదే పాయింట్.
ఆర్జీవీ ఇప్పుడు మీడియా ముందు ఎంత సుత్తి చెబితే అంత కామెడీ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెబుతున్న నీతలన్నీ ఆయన గతంలో చెప్పిన వాటికి భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ భయంతో చెబుతున్నారని అనుకుంటారు. ఎవరూ వినరు. ఎందుకంటే ఆర్జీవీ లాజిక్కులు ఇందులో లేవు. అవి ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంటాయి. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు హాజరు కాకుండా ఇలా సుత్తి లాజిక్కులతో మీడియా ముందు వాదన వినిపిస్తే విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టులో వాదిస్తారు. అప్పుడు చెప్పుకోవడానికి ఆప్షన్ ఉండదు.
సినిమాలో బిజీగా ఉన్నా.. లేకపోతే లేడీ ఆర్టిస్టులను ఎలాంటి యాంగిల్స్ లో చూపిస్తే ఎంత అసభ్యంగా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నావా అన్నది పోలీసులకు అనవసరం కదా. చేసిన తప్పుడు పనులకు కేసులు నమోదయ్యాయి. విచారణకు సహకరించాలి. అంత భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు సెల్ఫీ తీసుకున్న ధైర్యం ఇప్పుడు ఎక్కడికి పోయింది ?