అటు బైడెన్.. ఇటు బ్రిటన్ కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ను రెచ్చగొట్టేందుకు రోజుకోసారి ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడం.. వాటిని రష్యాపై వేసేందుకు అనుమతులు ఇవ్వడం కామన్‌గా మారిపోయింది. అదే సమయంలో తాము అణుబాంబులు వేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరింపులు కూడా కామన్ అయిపోయాయి. పుతిన్ బెదిరింపులతో ఆగడం లేదు. అణుబాంబులు వేసేందుకు తన ఆయుధాలను పొజిషన్‌కు తీసుకు వస్తున్నారు.
తమపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చే దేశాలను కూడా తాము శత్రువులుగా చూస్తామని వారిపై ఆణుబాంబులు వేయడం కూడా రష్యా విధానంలో భాగమని ఇటీవల పుతిన్ తమ దేశ పాలసీలో మార్పులు చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన అమెరికా, బ్రిటన్ లక్ష్యంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో అణు వార్ హెడ్లు మోహరిస్తున్నారు. తాజాగా బ్రిటన్ పై దాడి చేసేందుకు సాతాన్ 2 అనే అణు క్షిపణిని తరలించారు.
ఈ సాతాన్ 2 అనే అణు క్షిపణి అత్యంత ప్రమాదకరమైనది. ఎంత అంటే.. ఒక్క బాంబు వేస్తే మొత్తం బ్రిటన్ నాశనం అయిపోతుంది. అంత ప్రభావం ఉన్న ఈ బాంబు చూపించి పుతిన్ కొత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వైపు ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నారు. పుతిన్ చేతిలో అణుబాంబు ఇప్పుడు ప్రపంచదేశాలకు సమస్యగా మారింది.