నేరస్వభావమున్న తమ నేతను నమ్ముకున్న వైసీపీ నేతలకు డైలీ రొటీన్‌గా జైళ్లు, బెయిళ్లు మారిపోయాయి. ముందస్తు బెయిల్ కోసం పరుగులు పెట్టడం ..లేకపోతే అరెస్టు కాకుండా దాక్కోవడం.. అదీ కుదరకపోతే జైలుకెళ్లగానే బెయిల్ ఎలా తెచ్చుకోవాలా అని మధనపడటం.. వైసీపీ నేతలకు ఇంతకు మించిన దినచర్య లేకుండా పోయింది. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరు చేసిన తప్పులన్నీ బయటకు వస్తూండటంతో ఎలా కవర్ చేసుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు.
కిందిస్థాయి కార్యకర్త నుంచి పైస్థాయి పెద్దిరెడ్డి వరకూ అందరికీ ఒకటే బాధ. ఒఒకటి కాదు.. రెండు కాదు.. బోలెడన్ని తప్పులుకళ్ల ముందు ఉన్నాయి. వాటిపై కేసులు పెడితే..బయటకు రావడం కూడా కష్టం. పోనీ ఆ తప్పులన్నీ తాము చేశాం కానీ.. తమ ప్రయోజనాల కోసం కాదు జగన్ రెడ్డి ప్రయోజనాల కోసం.. జగన్ రెడ్డి అహం సంతృప్తి పరచడం కోసం. ఇందు కోసం ఒకరు కాదు. . ఇద్దరు కాదు వందల మంది వైసీపీ నేతల జీవితం జైళ్లు, బెయిళ్ల మీద నడుస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన నిర్వాకాల కారణంగా ఇప్పుడు వారు చేసిన ప్రతి తప్పుడు పని పని గట్టుకుని వెలికి మరీ కేసులు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది. గతంలో అయితే ఇలా ప్రభుత్వాలు మారితే..అలా సైలెంటుగా ఉంటేసరిపోయేది . కానీ ఇప్పుడు సైలెంటుగా గా ఉన్నా సరే వెతికి వెంటాడతారు. ఒక్క జగన్ వల్ల ఎంత మంది సఫర్ అవుతున్నారో .. ఎంత మంది కుమిలి కుమిలి ఏడుస్తున్నారో వాళ్లకే తెలుసు.