కూటమి ప్రభుత్వానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లుగా కనిపిస్తోంది. రెండు రోజుల కిందట కాకినాడ తీరంలో పోలీసులు చేజ్ చేసి పట్టుకున్న షిప్‌ను పవన్ కల్యాణ్ ఇవాళ పరిశీలించారు. అందులో లక్ష కిలోలకుపైగా బియ్యం ఉన్నాయి. అవన్నీ ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం. అధికారులు ఆ షిప్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడికి కంపెనీకి చెందినదని అధికారులు పవన్ కల్యాణ్‌కు చెప్పారు. ప్రస్తుతం ఆ షిప్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పోలీసుల అధీనంలో ఉంది.
వైసీపీ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం మాఫియాను బహిరంగంగానే నడిపారు. ఆఫ్రికా దేశాలకు మన దేశం నుంచి తరలిపోయిన బియ్యం ఎన్ని లక్షల కేజీలు ఉంటుందో చెప్పడం కష్టం. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని.. ఎండీయూ వాహనాల ద్వారా ఇవ్వకుండా కేజీకి పది చొప్పున ఇచ్చి మిగతా బియ్యం అంతా నొక్కేసేవారు. ఇలా ప్రతి నెల వేల టన్నుల బియ్యం దేశం దాటించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఈ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు ఎక్కువ సమయం కేటాయించారు.
ఇప్పుడు మళ్లీ అధికారులు పట్టించుకోవడం లేదని.. తమ గ్రిప్‌లో ఉన్న అధికారులను ఉపయోగించుకుని స్మగ్లింగ్ ప్రారంభించారు. విషయం తెలియగానే పోలీసులు పట్టుకున్నారు. అధికారులపై వన్ కల్యాణ్ మండిపడ్డారు. స్మగ్లింగ్ బియ్యం ఎలా షిప్‌లోకి చేరిందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కొండబాబుపైనా పవన్ సహనం వ్యక్తం చేశారు. మనం పోరాడింది ఇందుకేనా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మొత్తంగా పవన్ కల్యాణ్ ను అసభ్యంగా తిట్టి ఆయనను ఓడించేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన ద్వారంపూడికి పవన్ సవాల్ చేసినట్లుగా కటకటాల్లోకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అనుకోవచ్చు.