భారత రాష్ట్ర సమితి రాజకీయంగా సర్వైవ్ కావడానికి కొత్త మార్గాలు అన్వేషించలేకపోతోంది. తెలంగాణ ఏర్పడక ముందు పెట్టుకున్న స్ట్రాటజీనే ఇప్పటికీ ఫాలో అవుతోంది. తాజాగా దీక్షా దివస్ నిర్వహించిన బీఆర్ఎస్ అన్ని చోట్లా మరోసారి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసింది. కేసీఆర్ నాటి ఫోటోలతో కటౌట్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి నేతల ప్రసంగాల వరకూ అంతా మళ్లీ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేశారు.
రేవంత్ రెడ్డి సమైక్యవాదులకు మూటలు మోశారని.. ఇప్పుడు సమైక్య రాష్ట్రం తరహాలోనే పాలన సాగుతోందని కేటీఆర్, కవిత లాంటి వాళ్లు ఆరోపణలు చేశారు. మిగిలిన నేతలదీ అదే మాట. అంటే తాము అధికారంలో ఉంటే తెలంగాణ వాళ్లు పరిపాలిస్తున్నట్లుగా. .ఇంకెవరు అధికారంలో ఉన్నా సమైక్యవాదులు పరిపాలిస్తున్నట్లుగా బీఆర్ఎస్కు అనిపిస్తుంది. అదే భావన ప్రజలకు కల్పిస్తున్నారు. కానీ తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు వేరు. ప్రజల్లో రాష్ట్ర ఏర్పాటు కోరిక బలంగా ఉంది. అందు కోసం ఉద్యమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు ఇచ్చారు ఆంధ్ర వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ పై అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లు తాము పరిపాలన చేసిన తర్వాత మరోసారి సెంటిమెంట్ నే ఉపయోగిచుకోవాలనుకోవడం.. బీఆర్ఎస్ ఏ మాత్రం ఎదగలేదనడానికి సాక్ష్యం. పార్టీ పరంగా .. రాజకీయ పరంగా పోరాడేందుకు అవసరమైన బలాన్ని బీఆర్ఎస్ సాధించుకోలేకలేకపోవడంతోనే ఇలాంటి మార్గాలు అన్వేషించుకుంటున్నారని అనుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ ఎవర్ని ఆంధ్రోళ్లు అని నిందిస్తుంది.. రేవంత్ రెడ్డినా.. కాంగ్రెస్ నేతలందర్నా ?. వారందర్నీ అంటే.. రేపు మమ్మల్ని కూడా అనరాని గ్యారంటీ ఏమిటని సామాన్య ప్రజలు అనుకోరా ?