మబ్బులు వీడిపోతూండటంతో మళ్లీ హైదరాబాద్ రియాలిటీలో కళ కనిపిస్తోంది. రెండు, మూడు వారాల నుంచి అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఇది మరింత పుంజుకోనుందని వివిధ ప్రాజెక్టులకు వస్తున్న ఎంక్వయిరీలు, సైట్ విజిట్స్ నిరూపిస్తున్నాయని రియల్టర్లు అంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు యాభై, అరవై లక్షల బడ్జెట్ పెట్టుకున్న వారు .. గత ఆరు నెలలుగా సరైన సమయం కోసం చూస్తున్నారు. హైడ్రా సహా ఇతర అంశాలపై వస్తున్న క్లారిటీ వస్తూండటంతో ముందుకువస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యల వల్ల.. రియల్ మార్కెట్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పుడిప్పుడే బయ్యర్లు సైట్ విజిట్లకు వస్తున్నారని.. మరింత నమ్మకం ఏర్పడితే పూర్తి స్థాయి అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్లో రెడీ టు ఆక్యుపైతో పాటు ఏడాదిలోపు పూర్తయ్యే ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కొందరు బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారని పలువురు డెవలపర్లు అంటున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ప్రాజెక్టుల్లోనూ.. హండ్రెడ్ పర్సంట్ పేమెంట్ కింద ఫ్లాట్లను అమ్ముతున్నారు,
రియాల్టీకి డిమాండ్ తగ్గిపోవడం అనే సమస్య ఉండదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పరిస్థితుల వల్ల ఓ సమయంలో డౌన్ అయినా.. అంతా మెరుగుపడిన తర్వాత రెట్టింపుగా వృద్ధి ఉంటుందని తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితులను బిల్డర్లు గుర్తు చేస్తున్నారు. డౌన్ లో ఉన్నప్పుడు ఇళ్లు కొనుగోలు చేయడం కన్నా తెలివైన నిర్ణయం ఉండదని అంటున్నారు.