రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైయింది. ఈ చిత్రానికి సంబధించిన ప్రతీది పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎ. ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలో మరో పాన్ ఇండియా ఎట్రాక్షన్ చేరింది. ‘మీర్జాపూర్’ సిరీస్ ఫేమ్, బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇందులో భాగమయ్యారు. ‘‘మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా. వెల్కమ్ దివ్యేందు. లెట్స్ రాక్ ఇట్’’ అంటూ మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ లోకి దివ్యేందు రాకపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ‘మీర్జాపూర్’ సిరిస్ అంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణంలో మున్నా క్యారెక్టర్ ఒకటి. తొలి రెండు సీజన్స్ పాపులారిటీ కారణం మున్నానే. మున్నా క్యారెక్టర్ డిజైన్, ఆ పాత్ర పలికే డైలాగులు వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా తెలుగు వెర్షన్ డబ్బింగ్ లో మున్నా క్యారెక్టర్ బాగా కుదిరింది. ఆ డబ్బింగ్ చెప్పిన వాయిస్ పర్ఫెక్ట్ గా నప్పింది. ఇప్పుడు బుజ్జిబాబు ముందు మున్నా భాయ్ ఫ్యాన్స్ ఇదే విషయంలో ఓ విన్నపం ఉంచారు. ‘మీర్జాపూర్’ డబ్బింగ్ ఆర్టిస్ట్ తోనే మున్నా క్యారెక్టర్ కి తెలుగు డబ్బింగ్ చెప్పించాలని కోరుతున్నారు. మున్నా తెలుగు డబ్బింగ్ వాయిస్ బాగా వైరల్ అయ్యింది. జనాల్లో రిజిస్టర్ అయిపొయింది. బుచ్చిబాబు కూడా అదే వాయిస్ తో తెలుగు డబ్బింగ్ చెప్పించే అవకాశం వుంది.