వారంలో రెండు రోజులు కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని .. ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్యనేతల సమావేశంలో జగన్ ప్రకటించారు. ఆయన సమావేశానికి వచ్చిన ముఖ్యనేతలను చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోయింది. పెద్ద వాలంటీర్ గా టీడీపీ నేతలు సెటైర్లు వేసే దేవినేని అవినాష్‌తో పాటు రాజకీయ జీవితం ముగింపునకు వచ్చిన ప్రతాప్ అప్పారావు లాంటి ఒకరిద్దరు మాత్రమే గుర్తు పట్టేవాళ్లు ఉన్నారు. మిగతా వారంతా .. ఎవరో తీసుకు వచ్చిన వారికే తెలియాలి.
ఈ సమావేశంలో జగన్ తానేదో అతి మంచితనాన్ని చూపిస్తున్నానని ఫీలయ్యారు. అంత మంచితనం ఏం చూపించారో కానీ ఆయన పార్టీకి ఇప్పుడు క్యాడర్ కూడా లేదు. పదేళ్లు కష్టపడిన పార్టీ నేతలను ఐదేళ్లలో దోచి పడేశారు జగన్. ఆ దెబ్బకు క్యాడర్ అంతా కకావికలం అయిపోయింది. ఆయన పార్టీకి మిగిలింది వాలంటీర్లే. వారు కూడా ఇప్పుడు ఎవరి పనుల్లో వారు పడిపోయారు. సొంత కార్యకర్తలు ఉంటే.. పట్టించుకోకుండా వాలంటీర్లను లీడర్లు చేస్తానని చేసిన ప్రకటనలతో మిగతా క్యాడర్ సైడైపోయింది. అధికారం లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి వికృత ఆనందం కోసం చేసిన విపరీత చేష్టలకు ఇప్పుడు తాము ఎందుకు కష్టపడాలని మిగతా వారు జంప్ అయ్యారు.
అందుకే ఇప్పుడు వైసీపీకి క్యాడర్ లేదు. వారు మళ్లీ రావాలంటే జగన్ రెడ్డి ఒక పని చేయాలి.. తాను పడేసుకున్న కేరెక్టర్, క్రెడిబులిటీ ఏరుకుని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం అంటే.. ముందు క్యాడర్ కోసం ప్రాణం పెడతానని నిరూపించాలి. జైలు పాలవుతున్న ప్రతి క్యాడర్ కుటుంబాన్ని ఆదుకోవాలి. కానీ ఇప్పటి వరకూ కనీస లాయర్ సాయం కూడా చేయడం లేదు. ఇంకెవరు ముందుకు వస్తారు?