బంగ్లాదేశ్ పదేళ్ల కిందటి వరకూ సంక్షుభిత దేశం. నిరుద్యోగంతో అల్లాడిపోయేది. కానీ గత పదేళ్లలో ఆ దేశం ఎంతో ముందుకెళ్లింది. అక్కడి రాజకీయాల్లో కాస్త స్థిరత్వం రావడంతో పాటు తయారీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. వృద్ధిరేటులో భారత్ ను మించిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే పేస్ లో కొనసాగితే.. మరో దశాబ్దాం..రెండు దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశం అవుతుందని అంచనాలు వేశారు. ఎందుకంటే అక్కడ టెక్స్ టైల్ పరిశ్రమ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ప్రపంచంలో అమ్ముడయ్యే అత్యంత విలాసవంతమైన వస్త్ర బ్రాండ్ల ఉత్పత్తులు బంగ్లాదేశ్‌లోనే ఉత్పత్తవుతున్నాయి.
అభివృద్ధికి అవసరం అయిన ఓ మంచి వాతావరణం ఏర్పడిన పరిస్థితిని అక్కడి ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకుని విదేశీ పెట్టుబడులు ఆకర్షించి తమ యువతకు ఉపాధి కల్పించుకుని దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇలా చేయాలంటే ప్రభుత్వానికి ప్రజల సహకారం ఉండాలి. కానీ బంగ్లాదేశ్ యువత మతం మత్తులో పడి మొత్తానికి తమ దేశాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాధినేతను తరిమికొట్టి ..సూక్ష్మవడ్డీల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చినా వ్యక్తిగా పేరున్న వ్యక్తిని పీఠంపై కూర్చోబెట్టారు. ఆయన ప్రజల్ని ఎలా బాగు చేయాలో ఆలోచించడం లేదు. హిందువులపై ద్వేషం పెంచుతున్నారు. ఇండియాపై ద్వేషం పెంచుతున్నారు.
ఆయన కాటికి కాళ్లు చాపుకున్న నేత. కానీ బంగ్లాదేశ్ కు ఎంతో ఉజ్వల్ భవిష్యత్ ఉంది. కానీ ఆయన నాశనం చేస్తున్నారు. బంగ్లా యూత్ అర్థం చేసుకోలేకపోంది. ఫలితంగా మరో చైనాలా తయారీ రంగంలో మేడిన్ బంగ్లాదేశ్ ముద్ర వేయడానికి వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకున్నారు. ఇది ఆ దేశ యువత మరికొన్ని దశబ్దాల పాటు పేదరికంలో.. ఉద్యోగాలు లేకుండా గడిపేలా చేస్తుంది. ఇదంతా వారు చేసుకున్నదే.