‘పీలింగ్స్’ పాట పై దేవిశ్రీ ప్రసాద్ అంచనాలు పెంచారు. ముంబై ఈవెంట్ లో అల్లు అర్జున్ ఆ అంచనాలని మరో స్థాయికి తీసుకువెళ్లారు. సాంగ్ మామూలు గా వుండదు. థియేటర్ లో అందరూ డాన్సులు చేస్తారని చెప్పారు. ఇంతలా చెప్పిన పాట ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
దేవిశ్రీ, బన్నీ చెప్పింది అక్షరాలా నిజం, పాట మామూలుగా లేదు. ఊరమాస్ కి మించిన పదం ఏదో వాడాలి ఈ పాట గురించి చెప్పడానికి. దేవిశ్రీ ట్యూన్ విషయంలో అద్భుతం చేసేయాలని అనుకోలేదు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఊపు తగ్గకుండా రిధమ్, బీట్ ని ఎరెంజ్ చేశాడు. సాంగ్ లో హుక్ ఫ్రేజ్ లో మలయాళం లిరిక్స్ కావాలనే వాడినట్లు వున్నారు. ఒరిజినల్ క్రెడిట్స్ కూడా ఇచ్చారు.
చంద్రబోస్ సాహిత్యం గురించి చెప్పాలంటే.. మాస్ ఫీలింగ్స్ కి పరాకాష్ట. పుష్ప, శ్రీవల్లి క్యారెక్టర్స్ ఫీలింగ్స్ ని ఒడిసిపట్టుకొని రాశారు. ఇక ఈ సాంగ్ లో డ్యాన్సులు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పుష్ప రాజ్, శ్రీవల్లి బాడీలాంగ్వేజ్ కి తగ్గటు కొరియోగ్రఫీ చేశారు. మాస్ సిగ్నేచర్ స్టెప్స్ చాలానే కనిపించాయి. బన్నీని డాన్సుల్లో డామినేట్ చేయడం చాలా కష్టం. కానీ… రష్మిక ఆ ప్రయత్నం చేసింది. కొన్ని మూమెంట్స్ ని బాగా చేసింది. ఓరకంగా బన్నీ పై కంటే రష్మికపైనే చూపులన్నీ క్యూ కట్టేలా చేసుకోగలిగింది.
ముఖ్యంగా పుష్ప రాజ్ గుండెల మీద శ్రీవల్లి తన కాళ్ళతో దరువెయ్యడం పీక్స్. బన్నీ, పుష్ప రాజ్ ఫ్యాన్స్ ఎలాంటి మాస్ కోరుకుంటున్నారో అంత మాస్ ఈ సాంగ్ లో వుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది పుష్ప 2.