బీజేపీని సొంతంగా ఎదుర్కొనేంత బలాన్ని తెచ్చి పెట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ కనీసం మిత్రుల్ని అయినా కూడదీసుకుని బీజేపీని ఢీ కొట్టాలని చేసే ప్రయత్నాల్లో విఫలమవుతోంది. ఎన్నికలకు ముందు ఇండియా కూటమిని ఏర్పాటు చేసి ..దాదాపుగా బీజేపీని ఓడించినంత పని చేశారు కానీ..ఇప్పుడు మళ్లీ ఎవరికి వారు అవుతున్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఓటమికి కాంగ్రెస్సే కారణమని నిందించి దూరం జరిగేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
హర్యనాలో ఆమ్ఆద్మీ పార్టీని కలుపుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దాంతో ఢిల్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కలిసేది లేదని ఆప్ ప్రకటించింది. వచ్చే ముందు ముందు కూడా కాంగ్రెస్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కలవడం కష్టమని అనుకోవచ్చు. ఈ పరిస్థితి కాంగ్రెస్ వల్లే వచ్చింది. హర్యానాలో కొన్ని సీట్లను ఆప్ కు ఇచ్చి ఉంటే ఫలితాలు కూడా మారేవి. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పోరాటం చేసినా పరువు పోతుందన్న సంకేతాలు ఉన్నాయి. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ఓడిపోవడానికి కాంగ్రెస్సే కారణం అని ఉద్దవ్ థాకరే శివసేన ఆరోపిస్తోంది.
జార్ఖండ్లో కాంగ్రెస్ మైనర్ భాగస్వామినే. కొన్ని పార్టీలు బీజేపీతో సైద్ధాంతికంగా విబేధించి..కాంగ్రెస్ తో కలసి ఉంటున్నాయి. ఆయా పార్టీలతో కాంగ్రెస్ కలసి ఉండటానికి కారణం ఆయా రాష్ట్రాల్లో బలంగా లేకపోవడమే ప్రాంతీయ పార్టీలు ఇచ్చే కొన్నిసీట్లను తీసుకుని ఆయా పార్టీలను కూటమిలో ఉంచుకుని బలంగా ఉన్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతోంది.
కాంగ్రెస్ కూటమిని బలంగా ఉంచడంలో విఫలమైతే బీజేపీకి మరిన్ని అవకాశాలు కల్పించినట్లే. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ కూటమి విఫలమైతే.. కాంగ్రెస్ లేని కూటమే ఆవిర్భావించే అవకాశాలు ఉంటాయి.