ఇల్లు, స్థలం కొనే ముందు చాలా మంది తామే స్వయంగా డాక్యుమెంట్లు పరిశీలించి అంతా బాగుందని అనుకుంటూ ఉంటారు. లీగల్ ఒపీనియన్ కు వెళ్లినా అదే చెబుతారని అమ్మేవాళ్లు మోటివేట్ చేస్తారు. అనవసరంగా ఓ పది, ఇరవై వేలు ఖర్చు తప్ప ఏం ప్రయోజనం ఉండదన అంటారు. కానీ వీరెవరూ తర్వాత వచ్చే సమస్యలకు బాధ్యత వహించరు.
లీగల్ ఒపీనియన్ అనేది ఆస్తుల కొనుగోలు, అమ్మకాల వ్యవహారంలో చాలా కీలకం. ఆ లాయర్ కేవలం డాక్యుమెంట్లు మాత్రమే చూసి మాట్లాడరు… అన్ని విషాయలను పరిశీలిస్తారు. స్థలం న్యాయవివాదాల్లో ఉందా.. ఇల్లు అయితే చెప్పిన సర్వే నెంబర్ లోనే కట్టారా వంటి అంశాలను కూడ పరిశీలిస్తారు. అలాగే కొన్ని వివాదాలు కోర్టు వరకూ రాకపోవచ్చు. కానీ అది ప్రభుత్వ స్థలం అనే ఆరోపణలు ఉంటాయి. ఇలాంటి వాటిని చూసేందుకు అయినా లాయర్ ఒపీనియన్ తీసుకోవాలి.
హోమ్ లోన్ ఇచ్చే కంపెనీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటుందికదా ఇక నేను ఎందుకు అనుకునేవారు కూడా ఉంటారు.అసుల హోమ్ లోన్ కు అప్లయ్ చేసుకోక ముందే లీగల్ ఒపీనియన్ కు వెళ్లడం అత్యుత్తమం. ఇటీవలి కాలంలో ప్రీ లాంచ్ ఆఫర్లు, బై బ్యాక్ ఆఫర్లు వంటి వాటితో అదేపనిగా మోసం చేస్తున్నారు. వారి నుంచి బయటపడాలన్నా.. వాటి చట్టబద్దత గురించి తెలియాలన్నా లీగల్ ఒపీనియన్కు వెళ్లాల్సిందే. లక్షలు పెట్టి ఆస్తులు కొంటున్నప్పుడు చాలా కొద్దిమొత్తంలో పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోవడండ సమస్య కాదు. తీసుకోకపోతే తర్వాత వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కావొచ్చు.