హాలీడేహోమ్స్ అంటే హైదరాబాద్‌కు కరవై, డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఓ పొలంలో వేసిన ఫామ్ ప్లాట్‌ను కొనుక్కుని అక్కడ కంటెయినర్ ఇంటిని కట్టుకోవడం అనుకుంటాం. కానీ అది మన బోటి వాళ్ల ఆలోచన. కానీ కాస్త పెద్ద రేంజ్ ఉన్న వారి ఆలోచన వేరేలా ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే… హాలీడే వస్తే సరదాగా గోవా వెళ్లిపోవడం వరకు కాదు… అక్కడే సొంత ఇల్లు ఉంటే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వరకూ. ఇలాంటి వారు పెరిగిపోయారు. గోవాలో సొంత ఇళ్లు కొనుక్కుంటున్న వారి సంఖ్య ఇతర రాష్ట్రాల నుంచి పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరబాద్‌కు చెందిన యువ శ్రీమంతులు ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు.
వీకెండ్స్ లో గోవాకు వెళ్లేవారు హైదరాబాద్ నుంచి కొన్ని వేల మంది ఉంటారు. సెలవులు వస్తే అదే పని చేస్తారు వెళ్లినప్పుడల్లా హోటల్స్ ను వెదుక్కోవడం.. సమస్య అవుతుంది. ఖర్చు కూడా. అందుకే సొంతంగా ఓ ఇల్లు ఇంక్.. అది కూడా బీచ్ వ్యూస్ ఉంటే ఎంత బాగుంటుంది అనునేవారు లేకుండా ఉండరు. వారి వద్ద కాస్త వెసులుబాటు ఉన్నా ఆ పని చేస్తారు. వీరి ఆలోచనలను గుర్తిచిన గోవా రియల్టర్లు రకరకాల ప్లాన్లతో వారిని ఆకర్షిస్తున్నారు.
గోవాలో సొంతిల్లు కొని వీకెండ్స్ కో హాలీడేస్కో అక్కడుకు వెళ్తే మిగిలిన రోజులు ఆ ఇల్లు వృధాగా మెయిన్టనెన్స్ లేకుండా పడి ఉంటుంది. అదొక సమస్య. దీనికి అక్కడ రియల్టర్లు పరిష్కారం చూపిస్తున్నారు. ఆ ఇంటిపై ఆదాయం వచ్చే మార్గాలను చూపిస్తున్నారు. ఆ ఇంటిని నిర్వహించే బాధ్యతను తీసుకోవడం. ఖాళీగా ఉన్నప్పుడు రెంట్ కు ఇవ్వడం వంటి ఆదాయ మార్గాలను చూపిస్తున్నారు. అందుకే ఇటీవలికాలంలో. గోవాలో ఇళ్లు కొనే హైదరాబాదీల సంఖ్య పెరుగుతోంది.
తెలుగు సెలబ్రిటీస్‌లో చాలా మందికి గోవాలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. కానీ వారు సెలబ్రిటీలు. డబ్బులకు కొదువా ఉండదు.. కానీ ఇప్పుడు ఐటీ రంగంలో ఓ మైస్తరు ఉద్యోగులు కూడా ఏటా యాభై , అరవైలక్షల ప్యాకేజీలు అందుకుంటున్నారు., వీరు తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల జాబితాలో గోవాను చేర్చుకుంటున్నారు.