సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణఅ వెళ్లారు. తన ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించడంతో పాటు కాకినాడ పోర్టులో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉండి తిరిగి వచ్చిన తర్వాత నేరుగా కాకినాడ వెళ్లారు. అప్పట్నుంచి బియ్యం స్మగ్లింగ్ అంశం సంచలనంగా మారింది.
చంద్రబాబు,పవన్ భేటీలో తాజా రాజకీయాలపైనా… పలు కీలక కేసుల్లో తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా కేసుల్లో ఆర్జీవీ వంటి సెలబ్రిటీలు డబ్బులు తీసుకుని చేసిన వ్యక్తిత్వ హననంపై చర్చించినట్లుగా చెబుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇరువురూ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు .
ఇరువురి భేటీలో ఏం చర్చించారన్న దానిపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే చాలా వరకూ రాజకీయ అంశాలపై చర్చించారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనకు పవన్ కల్యాణ్ ఓ ప్రత్యేక మిషన్ పై వెళ్లారని చెప్పేవారు కూడా ఉన్నారు. ఆ విషయంలో జరిగిన డెవలప్మెంట్స్.. ఇతర అంశాలపై మాట్లాడినట్లుగాతెలుస్తోంది.