పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన తర్వాత వైసీపీకి మరింత చురుకుపుట్టింది. ఎప్పటిలాగే ఆయన సామాజికవర్గానికి చెందిన వారినే వైసీపీ రంగంలోకి దింపి ఎదురుదాడి చేయిచింది. బొత్స, పేన్ని నాని వంటి వాళ్లు పెట్టి విచిత్రమైన ప్రశ్నలు , సందేహాలు వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ అయితే పవన్ కల్యాణ్ నిజాయితీని, నిబద్ధతను శంకించడం లేదంటూనే ఆయనలో మరో గబ్బర్ సింగ్ కనిపిస్తున్నారని మండిపడింది. విశాఖలో ప్రెస్ మీట్ పెట్టిన బొత్స పవన్ కల్యాణ్ ను గబ్బర్ సింగ్ గా పదే పదే చెప్పుకొచ్చారు విశేషం ఏమిటంటే ఆయన పవన్ కల్యాణ్‌ను ఏమీ అనలేదు. ఇంకాపొగిడినట్లుగా మాట్లాడారు.
పవన్ లో సిన్సియారిటీ ఉందని.. తాను మొదటి సారి మంత్రి అయినప్పుడు కూడా అలాగే ఏదేదో చేద్దామనుకున్నానని గుర్తు చేసుకున్నారు. మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. పవన్ ను టార్గెట్ చేయమన ఆయనకు వైసీపీ హైకమాండ్ నుంచి సందేశం వస్తే ఆయన మాత్రం పొగిడిన వైనం చాలా మందిని ఆశ్చర్య పరించింది. అయితే పేర్ని నాని మాత్రం పవన్ కల్యాణ్ పై ఎప్పట్లాగే సెటైర్లువేశారు. పవన్ కు ఏమీ తెలియదన్నట్లుగా మాట్లాడారు. పక్కన ఇంకో షిప్ ఉందని ఆ షిప్లో ఎందుకు తనిఖీలు చేయలేదని ప్రశ్నించారు. ఆ షిప్ పయ్యావుల వియ్యంకుడిదని చెప్పుకొచ్చారు.
పవన్ కాకినాడ పోర్టు పర్యటన విషయంలో వైసీపీ ఉలిక్కి పడుతోంది. అక్కడ జరిగిన స్మగ్లింగ్ వ్యవహారం అంతా వెలుగులోకి వస్తోందని అదంతా తమకు చుట్టుకుంటోందని కంగారు పడుతున్నారు. అంతే కాదు కాకినాడ పోర్టు ఎలా చేతులు మారిందన్నదానిపైనా చర్చ జరుగుతూండటంతో… వైసీపీ ఆ టాపిక్ రాకుండా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.