జగన్ రెడ్డిని నమ్ముకుని ఏపీని అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నించ సక్సెస్ అయిన అరబిందోకు ఇప్పుడు అసలు సినిమా కనిపించే అవకాశం ఉంది. పోర్టును దౌర్జన్యంగా తమ పేరుపై రాయించుకున్నందుకు కేసులు నమోదయ్యాయి. పోర్టు గత యజమానులు ఈ మేరకు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అధికారం ఉంది కదా అని.. గత పోర్టు యజమానులను ఇష్టం వచ్చినట్లుగా బెదిరించారు. పోర్టులో 40 శాతానికిపైగా వాటా అరబిందోకు రాసివ్వకపోతే ప్రాణాలకూ గ్యారంటీ లేదని తుపాకీ పెట్టి హచ్చరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ప్రాణాలు, మిగతా వ్యాపారాలు కాపాడుకోవడానికి పోర్టులో వాటా రాసిచ్చిన వారికి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యం వచ్చింది. వారు సీఐడీకి ఫిర్యాదు చేశారు.
అరబిందో రియాల్టీ పేరుతో ఏపీలో చాలా సంస్థల్ని చేజిక్కించుకున్నారు. పదేళ్ల కాలంలో అధికార మాఫియాలాగా ఏర్పడి దోపిడీకి పాల్పడ్డారు. అరబిందోను అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డే బినామీల పేరుతో ఆ పోర్టులు, సంస్థల్ని రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డికి అరబిందో రియాల్టీ బినామిగా మారిందని చెబుతున్నారు. రెండు రోజుల్లో సీఐడీకేసు నమోదు చేస్తే వైసీపీ హయాంలో బెదిరించి లాక్కున్న సంస్థలకు చెందిన వారు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అరబిందో ఫార్మాకు అరబిందో రియాల్టీకి సంబంధం లేదు. ప్రస్తుతం అరబిందో రియాలిటీ.. ఔరో రియాల్టీగా మారింది. దీని యజమానికి శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు. అంతా ఒకటే అన్నమాట. ఈయన ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా కాలం జైల్లో ఉండి అప్రూవల్ గా మారారు. ఇప్పుడు మరోసారి ఏపీలో చేసిన నిర్వాకాల్లో జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
జగన్ రెడ్డి నమ్మి జైలుకు వెళ్లిన అనేక మంది పారిశ్రామికవేత్తలలో మరోసారి అరబిందో వారసుడు చేరనున్నారు.