హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ఔటర్ దాటి వెళ్తోంది. అయితే ఔటర్ లోపల అందుబాటులో ఇళ్లు దొరికితే మాత్రం పండగే అనుకోవచ్చు. అలాంటివి చాలా కొద్ది ప్రాంతాలు ఉన్నాయి.. వాటిలో చందానగర్ ఒకటి. నిజానికి చందానగర్ ఇప్పుడు సిటీలో అత్యంత బిజీగా ఉండే ఏరియాల్లో ఒకటి. అక్కడ అందుబాటు ధరలు అంటేరూ.యాభై లక్షలకు కనీసం అపార్టుమెంట్లు వస్తాయా అని ఆలోచిచేవారు ఉంటారు. మరీ చందానగర్ సెంటర్ లో రావు కానీ.. అక్కడి నుంచి ఔటర్ ను చేరుకునే మార్గంలో మాత్రం అందుబాటులో ఉన్నాయి.
చందానగర్లో శ్రీదేవి ధియేటర్ రోడ్ నుంచి. ఔటర్ రింగ్ రోడ్ కు వెళ్లే దారిలో లెక్కలేనన్ని కాలనీలు వెలిశాయి. అమీన్ పూర్ వైపు ఎటు చూసినా ఇళ్ల నిర్మాణంసాగుతోంది. అన్నిచిన్న చిన్న బిల్డర్లు,మేస్త్రీలు కడుతున్నఇళ్లు అపార్టుమెంట్లే. అన్ని రకాల అనుమతులతో నిర్మిస్తున్న ఈ ఇళ్లు అపార్టుమెంట్ రూ. యాభై లక్షల వరకూ వస్తోంది. మరింత విశాలమైన .. లగ్జరీ ఏర్పాట్లు కావాలనుకుంటే మరింత ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది.
ఇక్కడ ఇండిపెండెంట్ ఇళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మినిమం రూ.కోటి ఉంటుంది. కానీ అతి ఎక్కువ మొత్తం కాదు. భారీగా విస్తరిస్తున్న అభివృద్ధి చెందుతున్న ఏరియా కావడంతో.. దానికి తగ్గ రిటర్నులు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ రవాణా సౌకర్యాలు కూడా మెరుగవుతున్నాయి. నాలుగు లైన్ల రహదారి నిర్మాణంలో ఉంది. బీహెచ్ఈఎల్ వద్ద జాతీయ. రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణం చివరి దశలో ఉంది. మెట్రో కూడా ప్లానింగ్ లో ఉంది. అందుకే అందుబాటు ధరల్లో సిటీల్లోనే ఇళ్లు కొనుక్కోవాలనుకున్నవారికి ఇంత కంటే మంచి ప్రాంతం దొరకదని అనుకోవచ్చు.