పవన్ కల్యాణ్‌తో సినిమా అంటే అనుకొన్నంత ఆషామాషీ కాదు. స్టార్‌తో వ్యవహారం. అంచనాలు భారీగా ఉంటాయి. దాంతో పాటు పవన్‌కల్యాణ్ అతి జోక్యాన్ని భరించాలి. పవన్ లోనూ ఓ దర్శకుడున్నాడు. ఆయన్ని శాటిస్పై చేయాలి. ఇలా చాలా చాలా పడాలి. ప్రస్తుతం డాలీకీ అలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయని టాక్. ఎస్.జె.సూర్య తప్పుకోవడంతో డాలీ.. పవన్ సినిమాని టేకప్ చేసిన సంగతి తెలిసిందే. ఇది అనుకోని అవకాశం. మరొకరి కథని అర్థం చేసుకొని… సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి కొంతటైమ్ పడుతుంది. కథలో తన వంతు మార్పులకు డాలీ ఉపక్రమించాడు కూడా. అయితే.. మధ్యలో పవన్ మళ్లీ జోక్యం చేసుకొని… తన వంతు మార్పులూ, చేర్పులూ సూచిస్తున్నాడట.
ఇప్పటికే రెడీ అయిన స్క్రిప్టుని ఓన్ చేసుకోవడానికి మల్ల గుల్లాలు పడుతుంటే.. మధ్యలో పవన్ ని సంతృప్తి పరచడం మరింత పెద్ద తలనొప్పిగా మారిందట డాలీకి. నిజానికి డాలీ కూడా పవన్ కోసం ఓ కథ రెడీ చేసుకొన్నాడు. ఆ కథే చేద్దాం.. అనుకొన్నాడు. కానీ పవన్ మాత్రం… సూర్య ప్రిపేర్ చేసిన స్క్రిప్టు నే పవన్ ఫైనల్ చేశాడట. ఇది వరకు పవన్‌తో గోపాల గోపాలకు పనిచేసిన అనుభవం ఉంది డాలీకి. ఆసమయంలో పవన్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదట. ఇప్పుడు మాత్రం.. ప్రతీ విషయంలోనూ డాలీని టెన్షన్ పెడుతున్నాడట. ఇది వరకు సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనూ ఇదే జరిగింది. బాబికి ఆఫర్ ఇచ్చాడన్న మాటేగానీ.. తెర వెనుక తతంగం అంతా పవనే చూసుకొన్నాడు. ఈసారీ అదే జరుగబోతోందేమో అనిపిస్తోంది. గత ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఎలా???