ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేతల తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. తన సోదరుడు కుమార్తె పెళ్లి ఉండటంతో ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రిని కలిసినట్లిగా ఫోటోను విడుదల చేశారు. శుభకార్యానికి ఆహ్వానిచేందుకు వెళ్లారని ఇందులో రాజకీయం లేదని చెబుతున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉన్నట్లుగా మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. మొదట తన కుమారుడికి సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి లోక్ సభ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నించిన ఆయన తర్వాత ఇస్తామని చెప్పినా పోటీకి వెనుకడుగు వేశారు. కారణం ఏమిటో తెలియదు కానీ ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పని చేయలేదని చెబుతారు.
అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తో ఆయన చర్చలు జరిగాయని అంటున్నారు. మంత్రి పదవి కాకపోయినా కేబినెట్ హోదా ఉన్న పోస్టు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ ఉన్నదన్న గుసగుసలు వినిపించాయి. మరో వైపు కిషన్ రెడ్డితోనూ టచ్ లో ఉన్నాడని చెప్పుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు పుకార్లుగానే ఉండిపోయాయి కానీ ఆయన బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు.