సీఐజీ చీఫ్గా పని చేయడం అంటే.. చంద్రబాబు కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం, మార్గదర్శి కేసుల్లో అత్యుత్సాహం చూపించడం అనుకున్న ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. అలాంటి పనులు చేసినందుకు జగన్ రెడ్డి ఓ స్కాం చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆ స్కాం చేసి ఎవరూ పట్టుకోరులే అనుకున్నారు. కానీ ఆయన పాటలు పడే దేవుడు కూడా ఇలాంటి పాపాల్ని క్షమించలేదు. దొరికిపోయేలా చేశాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారు. రేపో, ఎల్లుండో అరెస్టు అవుతారుు.
సంజయ్ చేసిన స్కామ్ చాలా చిత్రమైంది. ఎవరెవరికో ట్రైనింగ్ ఇప్పించానని రాసేసుకుని డబ్బుల్ని తన ఖాతాలో వేసేసుకున్నారు. కాస్త పరిశీలనగా చూస్తేనే దొరికిపోయే కేసు. కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆయన సేవలకు మెచ్చి ఇచ్చిన సొమ్ము అది. కానీ అది కూడా స్కాం ద్వారా ఇచ్చారు. ఇప్పుడు నిండా మునిగిపోయారు. సంజయ్ కు మరో ఆప్షన్ లేదు. ఆయన ఇప్పటికే లెక్కలేనన్ని తప్పులు చేశారు. అందులో ఇది చాలా చిన్నది. చంద్రబాబు, మార్గదర్శి కేసుల్లో ఎన్ని సార్లు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారో చెప్పాల్సిన పని లేదు.
చంద్రబాబు కేసులపై కోర్టుల్లో వాదించడానికి వాయిదాలు కోరి రాష్ట్రాలు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. అక్కడే ఆయన సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అసలుగా తప్పుడు కేసులు పెట్టిన కుట్ర కూడా వెలుగులోకి వస్తుంది. అప్పుడు ఈయనకు అసలు ఐపీఎల్ ఎలా వచ్చిందాఅని దేశం మొత్తం చర్చించుకునే పరిస్థితి వస్తుంది.
ఐపీఎస్ సర్వీసులో ఉంటూ మత ప్రచారం.. వీడియోలు, పాటలు పాడుకునే సంజయ్ ను.. జగన్ రెడ్డి ఓ బకరాలాగా వాడుకున్నారు. ఇప్పుడు ఆయనకు అసలు విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.