రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భూముల అమ్మకంపై దృష్టి సారించింది. హైదరాబాద్ శివారులోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిన కోకాపేటలో మరి కొన్ని ఎకరాల భూమలు వేలానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. కేసీఆర్ హయాంలో ఎకరం రూ. వంద కోట్లకు ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు వేలంలో కొనుక్కున్నాయి. ఇప్పుడు అక్కడ హై రైజ్ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వానికి ఇంకా అక్కడ భారీగా భూములు ఉన్నాయి.
భూములను అమ్మితే తప్ప ప్రస్తుతం పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. రైతు బంధును జనవరిలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని అనుకుంటున్నారు. ఇందు కోసం నిధుల సమీకరణ అవసరం. అయితే ప్రభుత్వం ఇప్పుడు వేలం వేస్తే రూ. వందకోట్లకు ఎకరాన్ని కొనేవారు ముందుకు వస్తారా అన్నది కీలకంగా మారింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గతంలోలా లేదు. లావాదేవీలు తగ్గడంతో మనీ రొటేషన్ కూడా తగ్గింది. అదే సమయంలో నియోపోలీస్, కోకా పేట సామాన్యులకు అందుబాటులో ఉంటే అవకాశం లేదు. డిమాండ్ కు మించి లగ్జరీ ఇళ్ల సప్లయ్ ఉంది. ఇప్పుడు కంపెనీలు మరితం రిస్క్ చూపించే అవకాశాలు కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు.
అయితే భూముల విషయంలో రేట్లు తగ్గడం అనేది ఉండదని ఖచ్చితంగా రూ. వంద కోట్ల కంటే ఎక్కువ పెట్టేందుకు కొత్తగా వచ్చే రియల్ ెస్టేట్ కంపెనీలు అియనా రెడీ గా ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. గతంలో వేలంలో బీఆర్ఎస్ హైకమాండ్ తో అత్యంత సన్నిహితంగా ఉండేవారే పాల్గొనేవారన్న విమర్శలు ఉన్నాయి. ఈ సారి ఇంకా ఎక్కువ మంది రియల్ వ్యాపారులు వేలంలో పాల్గొంటారని భావిస్తున్నారు.