ఇల్లు కొనుక్కోవడం అంటే లైఫ్ టైం సెటిల్మెంట్ చాలా మంది మధ్యతరగతి జీవులకు. ఒకప్పుడు జీవితాంతం కష్టపడి చివరిలో కొనుక్కునేవారు. ఇప్పుడు ముందే కొనుక్కుని ఈఎంఐలు కట్టుకుంటున్నారు అదే తేడా. అయితే ఇలా కొనుక్కున్న ఇళ్లు చుట్టపక్కల పరిస్థితుల కారణంగా ఉండలేని పరిస్థితులు ఏర్పడితే నరకమే. ఎందుకంటే వదిలేసి పోలేరు.. అక్కడ పడే బాధల్ని భరించలేరు.
అందుకే ముందుగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనే ముందు ఇరుగు పొరుగు వారి మనస్థత్వాలను కూడా అంచనా వేయండి. అపార్టుమెంట్లలో అయితే చిన్న చిన్న విషయాల మీద గొడవపడే పొరుగు వారు ఉంటే ఇక ప్రశాంతంగా ఉండలేరు. కొంత మందికి తమ ఇంట్లో ఏం జరుగుతుందో అనే దాని కన్నా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి వారు ఉంటే మీ ప్రతి కదలికపై నిఘా ఉన్నట్లే. కొంత మంది పక్కింటి వాళ్ల మీద వాలిపోయి పనులు చేసేసుకుందామనుకుంటారు. ఇలాంటి మనస్థత్వాలు అపార్టుమెంట్లలో ఉంటాయి. ఎవరికి వారు తాము చేసేది కరెక్టే అనుకుంటారు. పక్కన వారిని ఇబ్బంది పెడుతున్నామని అనుకోరు. అలాంటి వారు ఉన్న పక్కనే ఇళ్లు కొనుక్కుంటే ఇక తప్పించుకోవడం లేదు.
ఇక చీటికి మాటికి గొడవలు పడేవారు ఉంటారు. మనుషులు అందరూ మంచి వారు కాదు.. అలాగని చెడ్డవారు కాదు. మనుషిలోనే అన్నీ ఉంటాయి. అలాగని అందరితో అడ్జెస్ట్ కావడం అందరికీ సాధ్యం కాని పని. మీరు ఇల్లు కొనే ముందుఎలాగూ.. ఇంటిపత్రాలు.. లొకాలిటి చూసుకుంటారు. అలాగే ఇరుగుపొరుగురావారి విషయంలోనూ కాస్త పరిశీలన చేయడంతో తప్పులేదు. అలా చేసి.. సర్దుకుపోగలం అనుకుంటే ఇక ఆ ఇంటికి తిరుగు ఉండదు. ఏమీ చూసుకోకుండా కొనుక్కుని తర్వాత నిత్య నిరకం అనుభవించడం కన్నా.. ఈ పరిశీలన కూడా తమ జాబితాలో చేర్చుకుంటే చాలా బెటర్ కదా !