ప్రొఫెసర్ గంటా చక్రపాణికి బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వీసీ పోస్టు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నియామకం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పై.. రేవంత్ పాలనపై కొన్ని రోజుల కిందటి వరకూ తాను గౌరవనీయ ప్రొఫెసర్ ను అనే సంగతి కూడా మర్చిపోయి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవారు. అయితే హఠాత్తుగా ఏమయిందో కానీ ప్లేటు ఫిరాయించారు. బీఆర్ఎస్ నిర్ణయాల్ని తప్పు పట్టడం ప్రారంభించారు. ఎందుకో ఇవాళ క్లారిటీ వచ్చింది. ఆయనకు ఓపెన్ యూనివర్శిటీ వీసీ పోస్టు వచ్చేసింది.
ఘంటా చక్రపాణి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లుగా చెప్పుకునేవారు. ఆయన ఏం చేశారో కానీ కేసీఆర్ కు మాత్రం నచ్చారు. తెలంగాణ ఏర్పాటు కాగానే టీజీపీఎస్సీ ఏర్పాటు చేసి ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. చాలా కాలం ఆ పదవిలో ఉన్నారు. కానీ పనేమీ ఉండేది కాదు. ఎందుకంటే కేసీఆర్ హయంలో గ్రూప్స్ నోటిఫికేషన్లు చాలా పరిమితంగా వచ్చాయి. ఒకటికి రెండు సార్లు ఆ పోస్టులో ఉన్న తర్వాత మరే పదవి కేటాయించలేదు. అయితే కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఏదో ఒకటి ఇస్తారని ఎరరు చూస్తూ కాలం గడిపారు. ఈ లోపు ప్రభుత్వం మారిపోయింది.
కొత్త ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా బ్లాక్ మెయిలింగ్ తరహాలో సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టం ప్రారంభించారు. అలా ఎందుకు మాస్టారూ అని ఎవరైనా సంప్రదించారో లేకపోతే ప్లేట్ ఫిరాయించాలి.. నోరు మూసుకోవాలంటే తనకు ఏం కావాలో ప్రతిపాదన పంపారో కానీ.. మొత్తానికి సెటిల్ చేసుకున్నారు. ఓ పదవి దక్కించుకున్నారు. ఘంటా చక్రపాణి లాంటి వాళ్లు ఉంటే.. బీఆర్ఎస్ కు భవిష్యత్ ఎలా ఉంటుందని ఆ పార్టీ నేతలు ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు.