పుష్ప సినిమాతో మెగా కుటుంబంలో చిచ్చు పెట్టేద్దామని వైసీపీ, సాక్షి మీడియా చేస్తున్న ప్రయత్నాలు చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు. జగన్ రెడ్డి ఎందుకిలా కంటిముందు కనిపించేవాటిని కూడా నిజాలుగా కాన్ఫిడెంట్ గా చెబుతారో చాలా మందికి అర్థం కాదు. సాక్షిలో వస్తుంది కాబట్టి అది నిజం అని ఆయన అనుకుని అంతే గట్టిగా వాదిస్తారని చెబుతారు. సాక్షిలో ఒక్కటీ నిజం రాదు. చివరికి పుష్ప డైలాగుల్ని కూడా లేని వాటిని ప్రచారం చేస్తూ డిస్కషన్ పెట్టారు. రేపు జగన్ కూడా ప్రెస్మీట్లో అల్లు అర్జున్ డైలాగుల గురించి చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ మనస్థత్వం అదే.
బాస్ డైలాగ్ ను వైసీపీ రచయతలు రచించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఒక్క బాస్ డైలాగ్ కాదు.. చాలా సినిమాలో లేని డైలాగుల్ని రాజకీయానికి అంటించి ప్రచారం చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి ఈ తంతు జరుగుతోంది. తాజాగా మైత్రీ మూవి మేకర్స్ ఈ మేరకుఓ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వాటిని ప్రచారం చేస్తే కేసులు పెడతామన్నారు. అయితే నేరుగా సాక్షి మీడియాలోనే డిస్కషన్ పెట్టేసి..ఆ డైలాగ్ సినిమాలో లేదు అన్న విషయాన్ని ఎవరూ చెప్పనీయకుండా చేసి చర్చ నడిపించారు.
అయితే ఆ డైలాగ్ ఉందని తాము చెబితే అందరూ నమ్మేస్తారని వైసీపీ, సాక్షి అనుకోవడమే వారి అమాయకత్వానికి సాక్ష్యం. ఎన్ని సార్లు పరువు పోయినా.. నిజం కాదని అందరికీ తెలిసినా తమ ఓనర్ జగన్ రెడ్డిని వి.. పుష్పం చేయడానికిపనికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. సాక్షిని.. సాక్షిలో వచ్చే వార్తల్ని నమ్ముకుని జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. అది ఆయనను ఏ స్థితికి దిగజార్చింతో ఆయన శ్రేయోభిలాషులు అయినా గుర్తించి చెబితే బాగుంటుందని వైసీపీ క్యాడర్ కోరుకుంటున్నారు.