దర్శకుడిగా బిజీగా ఉన్నాడు మారుతి. ప్రస్తుతం బాబు బంగారం సినిమా పనిలో ఉన్నాడు. ఆ సినిమా హిట్టయితే.. మారుతి స్టార్ హీరోలకు మరింత దగ్గరైనట్టే. మారుతి కోసం ఇప్పటికే కొంతమంది హీరోలు కాపుకాచుకొని కూర్చున్నారు. మరోవైపు నిర్మాతగానూ మారుతి తన అభిరుచికి తగిన సినిమాల్ని రూపొందిస్తున్నాడు. కథ, స్క్రీన్ ప్లే తన శిష్యులకు ఇచ్చి సినిమాలు తీస్తున్నాడు. తాజాగా రాజ్ తరుణ్‌కి మారుతి కథ అందించాడు. మారుతి కాన్సెప్టులు యువతరం ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంటాయి. అందుకే వాటికి భలే డిమాండ్. మారుతి కథకు 30 లక్షలకు పైగానే పలికిందట. పైగా ఈ సినిమాలో మారుతికి వాటా కూడా దక్కిందని టాక్. మారుతి బ్రాండ్‌తో రాజ్ తరుణ్ సినిమాకి సరికొత్త క్రేజ్ వచ్చింది. దాంతో బిజినెస్ పరంగానూ హెల్ప్ అవుతుంది.
దిల్ రాజుతో కలసి తీసిన రోజులు మారాయి సినిమా విషయంలోనూ అంతే. నిజానికి ఈ సినిమాకి మారుతి ఒకానొక నిర్మాతగా వ్యవహరించాడు. అయితే పెట్టుబడి పెట్టిందేం లేదు. కథ, స్ర్కీన్ ప్లే అందించాడంతే. సినిమాకి మంచి లాభాలొస్తే… మారుతి కథకు మంచి బేరం తెగినట్టే. యేడాదికి రెండు మూడు సినిమాలు తీస్తూ.. మరో అరడజను సినిమాలకు కథలు అందిస్తే.. మారుతి బోల్డన్ని డబ్బులు వెనకేసుకోవొచ్చు.