ఆంధ్రజ్యోతిలో సెకి, అదానీ, ఏపీ ప్రభుత్వం డీల్స్ పై ఎలాంటి కథనాలు రావడంలేదు. మొదట్లో రద్దు చేయాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేసిన ఆంధ్రజ్యోతి టోన్ మెల్లగా మారింది. రద్దు చేస్తే జరిమానాలు కట్టాలని.. మరకొటని.. మరొకటని చెబుతూ సైడ్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఆ కథనాలు రావడం లేదు. కానీ అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్ అంటూ ఫుల్ పేజీ ప్రకటనలు వస్తున్నాయి. ఆ ప్రకటనల పైనా అదాని గ్రూప్ అనే లోగో కూడా కనిపిస్తోంది. అంటే అదాని గ్రూపు ఆంధ్రజ్యోతిని డబ్బులతో కొడుతోందన్నమాట. ఆర్కే మార్క్ మార్కెటింగ్ అదే అనుకోవచ్చు.
అదానిపై అమెరికాలో కేసు ఏపీలోనూ రాజకీయ సంచలనంగా మారింది. ఈ విషయంలో గొంతెత్తిన మీడియా తర్వాత సైలెంట్ అవుతోంది. ఈ స్కాంలో అమెరికా ఎఫ్బీఐ కేసు నమోదు అయిన తర్వాత ఏపీలో రాజకీయదుమారం రేగింది. ప్రధాన మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి విస్తృతమైన కథనాలు రాశాయి. ఇప్పుడు ఈనాడు మాత్రమే అదాని విషయంలో వ్యతిరేక కథనాలు కొనసాగిస్తోంది. ఆంధ్రజ్యోతి కూడా ఆపేసింది. ఇతర పార్టీలు సైలెంట్ అయిపోయాయి. ఒక్క షర్మిల మాత్రమే ఎందుకు విచారణ జరిపించరు అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా జగన్ రెడ్డి లంచాలు తీసుకున్న వ్యవహారంలో అదానీ, సెకి వెనుక దాక్కోవడంతో ఆయన సేఫ్ అయ్యారని అనుకోవచ్చని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. అమెరికా కోర్టులో ఆదాని జగన్ రెడ్డికి ఏ రూపంలో లంచాలు ఇచ్చారు అన్నది బయటపడిన తర్వాత మరోసారి దుమారం రేగడం ఖాయం. అప్పుడు లంచం ఇచ్చిన అదాని కన్నా తీసుకున్న జగనే మొదటి నిందితుడు అవుతాడు. ఇప్పటికైతే అదానీకి పలుకుబడికి మెజార్టీ నోళ్లు మూతపడినట్లే.