భారత్లో జరుగుతున్న అవినీతికి అమెరికా మూలాలుంటే వదిలి పెట్టడం లేదు. కేసులు పెడుతున్నారు. అంతేనా అమెరికా గడ్డ నుంచి ఇండియాలో అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇది బీజేపీ నేతలకు నచ్చడం లేదని అమెరికాపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను చూస్తే అర్థమైపోతుంది. అదానీపై అమెరికా గడ్డ నుంచి ఇటీవల పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది భారత్ పై జరిగిన దాడేనని బీజేపీ అంటోంది.
బీజేపీ ఎప్పుడూ జార్జ్ సోరోస్ అనే అమెరికన్ ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ తో లింకులు కలుపుతూ ఉంటుంది. తాజాగా బిజెపి పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఇవే ఆరోపణలు చేశారు. మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని, అమెరికాకు చెందిన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’ కన్నింగ్ వ్యూహాలు పన్నుతుందని దీన్ని జార్జ్ సోరోస్ నడిపిస్తున్నారని ఆయన అంటున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’.. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో బలమైన నెట్వర్క్ ఉన్న అమెరికా సంస్థ. ఆర్గనైజ్డ్ నేరాలు, అవినితికి సంబంధించిన వ్యవహారాలపై ప్రత్యేక నివేదికలు తయారుచేస్తూ ఉంటుంది.
అయితే అమెరికా అయినా ఆఫ్రికా అయినా అదాని విషయంలో వచ్చే ఆరోపణల విషయంలో సైలెంటుగా ఉంటే ప్రజల్లో సందేహాలు పెరుగుతాయి. అదాని తప్పులు చేయకపోతే విచారణ చేయించి అలాంటిదేమీ లేదని తేల్చాలి. కానీ అమెరికాపై నేరుగా ఆరోపణలు చేసి… తమ దేశంలో జరుగుతున్న వాటి సమాచారం ఉంటే బయట పెట్టకూడదని అంటే ఎలా ?