అంబటి రాంబాబుకు జగన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చేశారు. సత్తెనపల్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని తేల్చేసినట్లుగా తెలుస్తోంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి ఇంచార్జ్‌గా నియమించాలని నిర్ణయించారు. ఏ క్షణమైనా తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రానున్నాయి. అయితే ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
అంబటి రాంబాబును ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని జగన్ సూచించినట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఆయన సోదరుడు పొన్నూరు ఇంచార్జుగా ఉన్నారు. కుటుంబంలో ఒకరికే అవకాశం ఉంటుందని .. ఇక నుంచి తెర వెనుక రాజకీయాలకే పరిమితమైతేచాలని అంబటి రాంబాబుకు చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించిన అంబటి రాంబాబు ఇటీవలి కాలంలో ఎంతో విధేయత చూపిస్తున్నారు. కానీ అలాంటివి జగన్ దగ్గర చెల్లవని ఆయనకూ ఇప్పుడు అర్థమయింది.
నిజానికి అంబటి రాంబాబును కాదని గత ఎన్నికల్లోనే ఇళ్లకు టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన ఇళ్లను మళ్లీ వెనక్కి రప్పించడంలో ఈ హామీనే కీలక పాత్ర పోషించింది. కానీ చివరి క్షణంలో అంబటికే చాన్సిచ్చారు. మంగళగిరిలో వైసీపీ ఓడిపోయిన తర్వాత అటు వైపు కూడా ఆళ్ల చూడటం లేదు. అక్కడ చాన్స్ లేదని అర్థం కావడంతో ఆయన సత్తెనపల్లి ఇంచార్జ్ గా వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చివరికి అనుకున్నది సాధించినట్లుగా తెలుస్తోంది.