మంచు మనోజ్ ను విష్ణు ఇంట్లో నుంచి గెంటేశారు. ఇంట్లో ఈ సందర్భంగా స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మోహన్ బాబు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. కింద జరుగుతున్న గొడవను ఆయన చూశారు. దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు నేరుగా జల్ పల్లి నివాసానికి వెళ్లారు. అప్పటికే మంచు విష్ణు మనుషులు ఇంట్లోనే ఉన్నారు. తాను తెప్పించిన బౌన్సర్లతో అందర్నీ బయటకు గెంటేయించారు విష్ణు. పోలీసులు కూడా విష్ణుకే సపోర్టుగా నిలిచారు. మనోజ్ ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనను బయటకు గెంటేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబే తమపై దాడి చేయించారని.. ఆస్తుల కోసం తాము పోరాడటం లేదన్నారు. ఆత్మగౌరవం కోసం.. తన భార్య, బిడ్డల రక్షణ కోసం పోరాడుతున్నానని చెప్పారు. తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయారు. మరో వైపు మంచు విష్ణు మరింత రూడ్ గా వ్యవహరించడంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించునే అవకాశాలు దాదాపుగా కనుమరుగు అయ్యాయని అంటున్నారు. మనోజ్ ఈ విషయాన్ని ఇంతటితో ఆపరని.. తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటారని అంటున్నారు.
మంచు విష్ణు రాకతో తాత్కలికంగా సమస్యను తొక్కేసినట్లుగా అనిపించినా ఆయన మరింత పెద్దది చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అందరి ఇళ్లలో ఉన్నట్లే సమస్యలు ఉంటాయని పరిష్కరించుకుంటామని చెప్పారు కానీ.. చివరికి తమ్ముడ్ని ఏకపక్షంగా గెంటేయడంతో పరిష్కరించుకోవడం కాకుండా.. మరింత పెంచుకున్నట్లు అయిందన్న వాదన వినిపిస్తోంది.