ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి పవన్ కల్యాణ్ ను కదిలించారు. ఆయనకో లేఖ రాశారు.అదేమిటంటే రాష్ట్ర విభజనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను తీసుకోవాలని కోరారు. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన అధికారంలో ఉన్నాయని.. . కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టేందుకు పవన్ శ్రద్ధ పెట్టాలిని సలహా ఇచ్చారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న విభజన సమస్యను కొలిక్కి తీసుకురావాలలని కోరారు. పార్లమెంట్ లో విభజన సరిగ్గా జరగలేదని ఆయన చెబుతున్నారు.
విభజన సరిగ్గా జరగలేదు.. పార్లమెంట్ చట్టం చెల్లదు అని చెప్పించాలనే పిచ్చి ప్రయత్నాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు పట్టుకుని లాగుతూంటారో ఇలాంటి లేఖల ద్వారా స్పష్టమవుతూ ఉంటుంది. జగన్ రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో మార్గదర్శిపై బోలెడన్ని పిటిషన్లు వేశారు కానీ.. ఈ విభజన సమస్యలపై ఒక్కసారంటే ఒక్క సారి కూడా జగన్ ను ప్రశ్నించేందుకు ప్రయత్నించలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి లేఖలు మాత్రం రాస్తున్నారు.
విభజన చట్టం పార్లమెంటో సరిగ్గా పాస్ కాలేదని ఆయన ఎంత వితండ వాదం చేసినా.. అది జరిగిపోయింది. మళ్లీ దానిపై చర్చే ఉండదని ఉండవల్లికి తెలుసు. ఆయనకు ఆ మాత్రం లాయర్ పరిజ్ఞానంఉంది. విభజన సమస్యల గురించి కూడా ఆయనకు స్పష్టత ఉంది. ఇప్పుడు ఆయన విభజన నష్టాల గురించి మాట్లాడుతున్నారంటే.. మళ్లీ వైసీపీతో కలిసి ఏదో డ్రామాలు చేయడానికి పరోక్షంగా ప్లాన్ చేసుకుంటున్నట్లేనని అనుమానిస్తారు. అయితే ఆయన ఈ సారి పవన్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. గతంలో ఆయన మేధావితనాన్ని పవన్ గుర్తించరు. అందుకే జగన్ కు సమస్యగా మారిన పవన్ ను ఆ కోణం నుంచి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.