ఓ భార్య, భర్త ఉన్నారు. ఇద్దరికీ సరిపడలేదు. దీంతో భార్య వెళ్లి తన భర్త అసహజ శృంగానికి ప్రయత్నిస్తున్నారని.. డబ్బుల కోసం వేధిస్తున్నారని కేసు పెట్టింది. అదంతా అబద్దమని వైవాహిక విబేధాల వల్లనే కేసు పెట్టిందని ఆ భర్త కిందా మీదా పడ్డాడు. ఆధారాలు చూపించాడు. అయినా చట్టాలు ఆయనకు అనుకూలంగా లేవు. మన దేశంలో నేరాలు చేసేది పురుషులే అన్నట్లుగా చట్టాలు ఉన్నాయి. గృహహింస చట్టం పురుషులకే వర్తిస్తుంది. మహిళలు ఎన్ని అబద్దపు ఫిర్యాదులు చేసిన పురుషులు భరించాల్సిందే. ఎన్నో పోరాటాలు చేసిన ఆ వ్యక్తి అన్నీ సమగ్రంగా వివరించి ప్రాణాలు తీసుకున్నాడు.
మగ సమాజాన్ని మేల్కొలుపుతున్న అతుల్ సుభాష్ ప్రాణత్యాగం
మగవారిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న మహిళల విషయంలో చాలా కాలంగా న్యాయస్థానాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా అలాంటి ఆడవాళ్ల నుంచి మహిళా రక్షణ కోసం ఎలాంటి ప్రయత్నాలుచేయలేదు. ఫలితంగా అతుల్ సుభాష్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటివారు మన సమాజంలో లక్షల్లో ఉంటారు. వేధింపులకు గురవుతూ మౌనంగా బతుకుతూ ఉంటారు.
మెన్టు అంటున్న పురుషలోకం
అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో అందరూ మెన్టు అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. చట్టాలు ఎందుకు పక్షపాతం చూపిస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మహిళలకు ఉన్న హక్కులు పురుషులకూ ఉండాలని అంటున్నారు. మారుతున్న సమాజంలో కుటుంబ విలువలు పాటించే మహిళల కన్నా.. అన్ని విధాలుగా స్వార్థంతో వ్యవహరించేవారు పెరిగిపోతున్నారని దానికి విడాకుల కేసుల్లో వినిపిస్తున్న వాదనలు, కోరుతున్న కోరికలే సాక్ష్యాలని అంటున్నారు.
మహిళల నుంచి మగవాళ్లు తమను తాము కాపాడుకోవాల్సిందే !
లైంగిక వేధింపులు అంటే మగవారే చేస్తారని అనుకుంటారు. కానీ ఆడవాళ్లు కూడా చేస్తారు. కానీ వారి పై కేసులు ఉండవు. తప్పుడు ఆరోపణలు చేస్తారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తారు. ఇంత జరగడానికి కారణం.. వారికి చట్టపరంగా ఉన్న సౌలభ్యాలే. ఈ సౌలభ్యాలను తీసేయాలని మగ సమాజం కోరడం లేదు కానీ.. తమకూ రక్షణ కల్పించాని కోరుకుంటున్నారు. మెన్టు అని నినదిస్తున్నారు. పాలకులకు వినిపిస్తుందా ?