అంబటి రాంబాబు సోదరుడు మురళి గుంటూరు నగరంలో భజరంగ్ జూట్ మిల్లు స్థలాన్ని అడ్డగోలుగా సొంతం చేసుకుని నిర్మిస్తున్న హైరైజ్ ఆపార్టుమెంట్ కూల్చక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నారు. రైల్వేట్రాక్ పక్కనే .. ఐదు అంతస్తుల అపార్టుమెంట్ కుఅనుమతి తీసుకుని పదిహేను అంతస్తులు నిర్మించేశారు. నగరపాలకసంస్థ అనుమతుల్లేవు. అంతపెద్ద అపార్టుమెంట్ నిర్మించడానికి పాటించాల్సిన నిబంధనలు కూడా పాటించలేదు. దాంతో ఆ అపార్టుమెంట్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
నిజానికి ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని ఒకప్పుడు జనసేనలో ఉండి.. ఆ తర్వాత బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మారిన తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కంపెనీ చేపట్టింది. అప్పటికే కొన్ని అపార్టుమెంట్లు నిర్మించి అమ్మేసింది. సెకండ్ ఫేజ్ ప్రారంభించే సరికి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎవరెవరో వచ్చి పార్టనర్లుగా చేరారు. ఆయన కంపెనీ బయటకువచ్చిందో..వెళ్లగొట్టారో తెలియదు.. అది అంబటి మురళి చేతుల్లోకి వచ్చింది.
ఈ అపార్టుమెంట్ నిర్మాణాల్ని ఆయనపైపైకి తీసుకుపోయారు. ప్రభుత్వం వారిచేతుల్లో ఉండటంతో కట్టేసి అమ్ముకుంటేఓ పనైపోతుందని అనుకున్నారు. కానీ పూర్తి కాలేదు. ప్రభుత్వం మారింది. ఆ మురళి రాజకీయాల్లోకి వచ్చి ధూళిపాళ్ల నరేంద్రపై పొన్నూరులో పోటీ చేశారు. నరేంద్ర.. మురళి నిర్వాకాలన్నింటినీ మీడియా ముందుపెట్టి పోరాటం చేశారు. దాంతో ఆ అపార్టుమెంట్ ఇల్లీగల్ అని నిర్ధారణ అయింది. ఇప్పుడు ఆ అపార్టుమెంట్ కూల్చకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది.