ప్రభాస్ చేతినిండా బోలెడు సినిమాలు. ఎప్పుడూ ఏదో ఓ సినిమాకు సంబంధించిన అప్ డేటో.. సమాచారమో అభిమానులకు అందుతూనే ఉంటోంది. ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ‘రాజాసాబ్’ పనుల్నీ త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ‘సలార్ 2’ కోసం కూడా త్వరలోనే డేట్లు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
‘సలార్ 2’పై ప్రశాంత్ నీల్ గట్టిగా ఫోకస్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్టుని ఆయన పూర్తి స్థాయిలో లాక్ చేశారు. నటీనటుల డేట్లు కూడా ఖాయం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ‘సలార్`లో శ్రుతిహాసన్ కథానాయికగా కనిపించింది. నిజానికి రెగ్యులర్ సినిమాలో ఉండే కథానాయిక పాత్ర కాదు శ్రుతిది. తన డ్యూరేషన్ కూడా తక్కువే. పార్ట్ 2లో ఆ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని సమాచారం. అందుకే ఈ సినిమా కోసం కియారా అద్వాణీని తీసుకొన్నారట. ఆమెను పూర్తి స్థాయి హీరోయిన్ గా చూపించబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ – కియారా కాంబో సెట్ చేయాలని చాలామంది దర్శకులు భావించారు. కానీ ఎందుకో కుదర్లేదు. కానీ ఈసారి మాత్రం పక్కాగా ఈ కాంబినేషన్ సెట్టయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ – కియారా జంట కూడా చూడ్డానికి బాగుంటుంది. పైగా ‘సలార్`లో పూర్తిగా మగ వాసనే. రానెస్ ఎక్కువ. ఈసారి మాత్రం ప్రశాంత్ నీల్ గ్లామర్ కీ చోటివ్వాలని భావిస్తున్నాడు. అందుకే కియారా క్యారెక్టర్ పై ప్రత్యేకమైన శ్రర్థ పెట్టాడని టాక్.