మంచు మోహన్ బాబు ఆవేశం ఆయనను ఆజ్ఞాతంలోకి నెట్టేసింది. టీవీ చానల్ రిపోర్టర్ పై దాడికేసులో ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన పోలీసులకు ఇవాళ అందుబాటులో ఉంటానని చెప్పారు. జల్ పల్లి నివాసానికి వచ్చి స్టేట్ మెంట్ నమోదు చేసుకోవచ్చని కూడా సమాచారం ఇచ్చారు. అయితే ముందస్తు బెయిల్ కొట్టి వేయడంతో అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మోహన్ బాబుపై తీవ్రమైన హత్యాయత్నం కేసు పెట్టారు. అందుకే అరెస్టు చేయడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనలో ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ నే అరెస్టు చేశారు. దాంతో ఏ వన్ గా ఉన్న తనను అరెస్టు చేయకుండా వదిలి పెట్టరని మోహన్ బాబు ఫీలయ్యారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేవరకూ అయినా ఆజ్ఞాతంలో ఉండాలనుకుంటున్నారు.
ఏం మట్లాడుకున్నారో కానీ కుటుంబ సమస్యపై అందరూ సైలెంట్ కావాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ ఘటనల్లో మోహన్ బాబు చేసిన దాడి తో మాత్రం ఆయన కేసుల పాలు కావాల్సి వచ్చింది. మొత్తంగా అసలు కంటే కొసరు కేసు మోహన్ బాబుకు సమస్యగా మారింది. జైలుకు తీసుకెళ్లే పరిస్థితి తెచ్చి పెట్టింది.