సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటన కేసు కోర్టులో ఉందని తాను ఏమీ మాట్లాడబోనని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఒక రాత్రి జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఉదయమే చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయిన ఆయన నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ్నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రేవతి కుటుంబానికి తన సానుభూతి ఉంటుందని అన్నారు. ఆ రోజు సంధ్యాధియేటర్ లో తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని అన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని స్పష్టం చేశారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను బాగానే ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు.
కావాలనే ఓ రాత్రంతా జైల్లో ఉంచారా… ప్రభుత్వం మీపై కక్ష కట్టిందని భావిస్తున్నారా లాంటి వివాదాస్పదప్రశ్నలతో అర్జున్ నుంచి మీడియా ప్రతినిధులు మసాలా కోరుకున్నారు కానీ.. ఆయన ఏమీ స్పందించలేదు. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పి వెళ్లిపోయారు.