అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు,ఆయన స్నేహితులు అందరూ పరామర్శించారు. ఆ దృశ్యాలన్ని దాదాపుగా వంద నుంచి రెండు వందల కెమెరాల్లో అందరికీ చూపించారు. ఏయితే ఏ కెమెరాలో చూసినా శిల్పా రవిచంద్రారెడ్డి అనే అర్జున్ స్నేహితుడు మాత్రం కనిపించలేదు. ఆయన కోసమే ఎందుకు వెదికారంటే అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ ఆయనే కారణం మరి.
అర్జున్ అరెస్టుకు కారణం అయిన తొక్కిసలాట జరిగిన ప్రీమియర్ షోకు..శిల్పా రవిచంద్రారెడ్డి కూడా అర్జున్ తో పాటు వెళ్లారు. నిజానికి ఆయనపై బైరెడ్డి శబరి చేసిన ఓ ట్వీట్ ను సీరియస్ గా తీసుకుని కౌంటర్ ఇచ్చేందుకు బన్నీని శిల్పా రవిచంద్రారెడ్డి తీసుకెళ్లారన్న ప్రచారం ఉంది.చివరికి అది తేడాగా మారింది. ఎన్నికల ప్రచారం సమయంలోనూ అందరూ పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్తే అర్జున్ మాత్రం నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం వెళ్లారు. అక్కడా ఓ కేసునమోదు అయింది.కానీ హైకోర్టులో క్వాష్ చేయించుకోగలిగారు.
ఇంత జరిగిన తర్వాత శిల్పా రవిచంద్రారెడ్డి అర్జున్ ను పరామర్శించాడనికి రాలేదు. కోర్టు వద్దకు..జైలు వద్దకు వెళ్లలేదు.దీంతో సోషల్ మీడియాలో చాలా మంది ఫ్రెండ్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆయన మళ్లీ వస్తే మళ్లీ ఏమైనా సమస్యలు వస్తాయని .. రావొద్దన్నారేమోనని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.