వైసీపీలో ప్రజాదరణ ఉన్న నాయకులకు కీలక పదవులు అప్పగిస్తున్నారు. అందులో భాగంగా లక్ష్మిపార్వతికి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆమె చంద్రబాబుపై , ఎన్టీఆర్ కుటుంబంపై ఎప్పుడు నోరు పారేసుకోవాలని ఆదేశాలు వచ్చినా తూ. చ తప్పకుండా పాటిస్తున్నారు. అందుకే ఆమెకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఆమె పార్టీలో చేరలేదని..గతంలో చెప్పుకున్నారు. తాను ఓ పార్టీకి అధ్యక్షురాలినని చెప్పుకునేవారు. ఇప్పుడు నేరుగా వైసీపీలో ప్రధానకార్యదర్శి అయ్యారు. తాను అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని వైసీపీలో విలీనం చేసి ఉంటారు.
తమ పార్టీ అధినాయకత్వం ఇంకా అసలు సమస్యను గుర్తించడం లేదని… ఇలాంటి నియమకాలు జరిగినప్పుడువైసీపీ క్యాడర్ నిట్టూరుస్తూ ఉంటుంది. ఆమె వల్ల పార్టీకి ఒక్క ఓటు ఉపయోగం ఉండకపోగా మీడియా ముందుకు వచ్చిన ప్రతీ సారి ప్రజలు తిట్టుకునేలా ఆమె స్పీచ్‌లు ఉంటాయి. అయినా జగన్ రెడ్డికి ఆమె స్పీచ్లుఅంటే చాలా ఇష్టం. అన్నింటికీ చంద్రబాబుకు ముడి పెట్టేసే ఆమె తీరు ముచ్చటగా ఉంటుదంని వైసీపీ పెద్దలు అనుకుంటూ ఉంటారు. దాంతో పదవి లభించింది.
లక్ష్మిపార్వతి ఎపుడో వైఎస్ పంచన చేరారు. ఆయన చనిపోయాక జగన్ తో చేరారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో .. విశాఖ ఏయూలో విజిటింగ్ ప్రొఫెసర్ పేరుతో డబ్బులు దండుకున్నారు. ఓ నామినేటెడ్ పదవితో ఐదేళ్లూ నెలకు ఐదులక్షలకు తక్కువకాకుండా జీతం పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు. ఇప్పుడు పార్టీలో ఆమెకు గుర్తింపు లభించింది.