గవర్నర్ పర్మిషన్ రాగానే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చాలా కాలంగా కేటీఆర్ అరెస్టు విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డిచెబుతూ వస్తున్నారు. గవర్నర్ పర్మిషన్ కూడా వచ్చింది. అది కూడా ఒక్క కేసులో కాదు. రెండు, మూడు కేసుల్లో కేసులు పెట్టుకోవచ్చని.. విచారించుకోవచ్చని గవర్నర్ పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. ఆ కేసుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉంది.
ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఏసీబీ అధికారులు .. ఫార్ములా ఈ రేసు కేసులో గోల మాల్ అయిన రూ. యాభై కోట్ల అంశంపై కేసులు పెట్టడం ఖాయమే. విచారణకు పిలుస్తారా లేకపోతే నేరుగా అరెస్టు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆ డబ్బుల్ని తానే చెల్లించమని ఆదేశించానని కేటీఆర్ చెబుతున్నారు. అలా నోటిమాటగా ఆదేశిస్తే ప్రజాధనాన్ని తరలించలేరు. దానిలో లెక్క ఉండాలి. ఆదేశాలు ఉండాలి. పత్రాలు ఉండాలి. అవేమీ లేకకపోవడంతో అది అక్రమంగా తరలించఀడమే అవుతుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఆయనపై కేసులు పెట్టి విచారించడానికి కూడా పర్మిషన్ వచ్చింది. ఈ కేసు అత్యంత తీవ్రమైనది. కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ ట్యాపింగ్ జరిగిందని గట్టిఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసినా చేయవచ్చు. అయితే ఇవన్నీ రాజకీయంగా సున్నితమైన విషయాలు. అందుకే పోలీసులు ప్రతి దశలోనూ.. ప్రభుత్వపెద్దల సూచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ప్రభుత్వ నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.