వైసీపీ పరిస్థితి ఇలా అయిపోయిదేమిటి అని .. ఆ పార్టీ చెందిన వీరాభిమానులు మథనపడుతున్నారు. ఓ హీరోకు అవసరం లేకపోయినా మద్దతు ఇచ్చి.. ఆయన అరెస్ట్ అయితే చొక్కాలు చింపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమిటి అని మథన పడుతున్నారు. దీనికి కారణం ఆ హీరో.. తమకు చుక్కలు చూపించిన పవన్ కల్యాణ్ కు కాస్త వ్యతిరేకంగా ఉన్నారన్న అభిప్రాయమే. అయితే ఎప్పటికైనా వాళ్లూ.. వాళ్లూ ఒక్కటే. ఆ విషయం వైసీపీ కింది స్థాయిక్యాడర్ కు తెలుసు. పై వాళ్లకే అర్థం కావడం లేదు.
అల్లు అర్జున్ తనపై ఇలాంటి అభిమానం ఎందుకు చూపిస్తున్నారో.. తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. ఎవరి మద్దతు వెనుక ఎలాంటి ఇంటెన్షన్ ఉందో కూడా తెలుసు. అలాంటి ట్రాప్ లో ఆయన పడే అవకాశం లేదు. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఆయనతో ఇదే వైసీపీ బ్యాచ్ ఎలా ప్రవర్తించారో కూడా ఆయన గుర్తుంచుకునే ఉంటారు. ఇప్పుడు ఆయన ద్వారా ఏదో రాజకీయం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి అర్జున్ ను మించి నటనా కౌశలంతో వీర ప్రదర్శన చేస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ దగ్గర నుంచి కింది స్థాయి వరకూ చేస్తున్న స్కిట్స్ చూసి పాపం అనుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏదో చేద్దామని అనుకున్నారు . చివరికి చిరంజీవిని అవమానించారు . పెద్ద హీరోలను పిలిపించుకుని దండాలు పెట్టించుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఓ హీరో తమకు కొన్ని ఓట్లు అయినా తెచ్చి పెడతడానికి బహిరంగంగా కాళ్లు , గడ్డాలూ పట్టుకుంటున్నారు. కాలం మహిమ అంటే ఇదే మరి. !