ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇంత కాలం పరిస్థితులు కలసి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు టీడీపీ చేతుల్లోఉన్నాయి. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కారణంగా తమ పార్టీ మూలపురుషుడికే కాకుండా బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ కు ఢీకొట్టిన దిగ్గజంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే సరైన టైమింగ్స్ కోసం.. కేంద్రం ఎందురు చూస్తుందని అనుకోవచ్చు.
తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో చంద్రబాబునాయుడు మరోసారి అదే డిమాండ్ చేశారు. భారతరత్న వచ్చేదాకా వదిలి పెట్టబోమన్నారు. ఆయన తల్చుకుంటే.. నెక్ట్స్ అవార్డుల ప్రకటన సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఉంటుంది. కానీ అలా ప్రకటిస్తే ఎన్టీఆర్ సతీమణి తానే అంటూ లక్ష్మిపార్వతి ముందుకొస్తారు. ఆమె చేసే రచ్చకు వైసీపీ మీడియా, సోషల్ మీడియా అదనంగా జత చేసే కంపును తట్టుకోవడం అసాద్యం. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి గత ఏడాది ఎన్టీఆర్ కాయిన్ విడుదల సందర్భంగా లక్ష్మిపార్వతిని ఆహ్వానించలేదు., ఆమె కుటుంబసభ్యురాలు కాదన్న భావన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
వచ్చే ఏడాది , రెండేళ్లలో ఈ సమస్యను కూడా అధిగమించి ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎన్టీఆర్ సిగలో భారతరత్నం చేరుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇప్పుడు చాన్స్ మిస్సయితే.. మళ్లీ అవకాశం కోసం ఎదురు చూడాల్సి ఉంటుందని.. చంద్రబాబు అంత చాయిస్ తీసుకోరని చెబుతున్నారు నిజానికి గత ఏడాదే ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆగింది. ఈ సారి ఆగే చాన్స్ లేదు.