దేశంలో మగవాళ్లపై చట్టాలు చూపిస్తున్న వివక్ష, వ్యవస్థల అవినీతి, డబ్బు కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్న మహిళల తీరు వల్ల నలిగిపోతున్న మహిళల నుంచి మగవాళ్లను రక్షించడానికి ప్రాణత్యాగం చేసిన బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య నిఖితా సంఘానియాను గుర్గామ్లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె తల్లి, సోదరుడ్ని కూడా అరెస్టు చేశారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి వారు పరారీలో ఉన్నారు.
అతుల్ సుభాష్, నిఖితా సింఘానియా వైవాహిత జీవితంలో వివాదాలు రావడంతో .. భర్తపై నిఖితా దారుణమైన ఆరోపణలతో కేసులు పెట్టింది. అసహజ శృంగారానికి ఒత్తిడి చేస్తున్నాడని.. డబ్బులు అడుగుతున్నాడని.. ఇలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. అవన్నీ అబద్దాలేనని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. చట్టాలు మొత్తం నిఖితాకే అండగా నిలిచాయి. స్వయంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ నిఖితా ఐదు కోట్లు డిమాండ్ చేసింది. విడాకులు అలా అయితేనే ఇస్తానని చెప్పింది. లేకపోతే కేసు కొనసాగిస్తామని తేల్చింది. ఫ్యామిలీ కోర్టు జడ్జి కూడా ఐదు లక్షలు లంచం అడిగినట్లుగా అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్ లో రాశారు.
సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం అయింది. మగవారి హక్కులపై ఇప్పుడు చర్చ ప్రారంభమయింది. ఇప్పుడు నిఖితా సింఘానియాను అరెస్టు చేశారు కానీ ఆమెపై చాలా చిన్న కేసులు మాత్రమే పెట్టగలరు. ఆత్మహత్యకు కారణమయ్యారన్న కేసు మాత్రం పెట్టగలరు. దాని వల్ల ఆమెకు పెద్ద సమస్యేమీ ఉండదు. ఇలాంటి సమస్యకు దీర్ఘలికాల పరిష్కారం రావాలని చాలా మంది మగవాళ్లు కోరుకుంటున్నారు.