మన దేశంలో ఓ తరానికి అత్యంత ఇష్టమైన కళాకారుడు జకీరు హుస్సేన్. వహ్ తాజ్ అంటూ ఆయన ఓ టీవీ ప్రకటనలో చేసిన తబలా ప్రదర్శన, దానికి మించి ఆయన చెప్పిన డైలాగ్.. కొన్నేళ్ల పాటు మార్మోగిపోయిది. అది సామన్య జనంలో ఆయన ఎవరో తెలిసేలా చేసింది. కానీ ఈ పేరుతో ఆ దిగ్గజాన్ని గుర్తు చేసుకోవడం మాత్రం ఆయనకు అవమానం. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు, ప్రతిభ అనన్యసామాన్యమైనవి. తబలా కళాకారుడు అంటే ముందుగా గుర్తుచ్చే పేరు జకీర్ హుస్సేన్. ఆయన అమెరికాలో చనిపోయారు. మృత్యువుతో తుదికంటా పోరాడి… కన్నుమూశారు.
జకీర్ హుస్సేన్ .. మంత్రముగ్ధమైన తబలా వాద్యాన్ని వినిపించడంలో సాటిలేని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తబలా విద్వాంసుల కుటుంబంలో పుట్టిన ఆయన చిన్న తనం నుంచే అందులో ప్రతిభ చూపారు, పదకొండేళ్లకే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. 1969లోనే ఆయనకు అమెరికా యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. మ్యూజిక్ ప్రపంంచంలో ఆయనది ఓ ప్రత్యేకమైన శైలి. మొదటి ఆల్బమ్ 1991లో విడుదల చేశారు. గ్రామీ అవార్డును కూడా సాధించారు.
సుదీర్ఘ కాలంగా అమెరికాలో స్థిరపడిన ఆయన కుటుంబంతో సహా అక్కడే నివసిస్తున్నారు. ప్రతిష్టాత్మ విశ్వ విద్యాలయాల్లో అతిథి అధ్యాపకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన మాత్రం.. తన మ్యూజిక్ ఆల్బమ్ కన్నా ఓ టీ పొడి కంపెనీ ప్రకటనతో … ఇప్పుడు నలభైల్లోఉన్న దేశ యువతకు బాగా పరిచయం. ఆ హెయిర్ స్టైల్.. ఆ తబలా నైపుణ్యం అందర్నీ ఓ ట్రాన్స్ లోకి తీసుక్లేది. అందుకే జకీర్ హుస్సేన్ను అందరూ స్మరించుకుంటున్నారు.