ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసినప్పుడు ఇక్కడ తన ఫోన్ పోయిందని విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాదు సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అక్కడ సీబీఐ శరత్ రెడ్డిని అరెస్టు చేస్తే ఇక్కడ విజయసాయిరెడ్డి ఫోన్ మిస్ కావడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు విజయసాయిరెడ్డి ఫోన్ పోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. తాజాగా ఓ టీడీపీ కార్యకర్త ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం పోలీసులకు అసలు ఫిర్యాదు రాలేదట.
నిజానికి అప్పట్లో విజయసాయిరెడ్డి వద్ద ఏపీగా పని చేసే ఓ జర్నలిస్టుతో ఫిర్యాదు ఇప్పించారు. పార్టీ ఓడిపోయిన తర్వాత ఉద్యోగం నుంచి ఆ జర్నలిస్టును తొలగించడంతో ఓ టీవీ చానల్ లో చేరిపోయారు. ఆ టీవీ చానల్ ఏదో కాదు.. విజయసాయిరెడ్డి లొల్లి పెట్టుకుని చర్చలకు సవాళ్లు విసిరే చానలే. ఇప్పుడు ఆ జర్నలిస్టు ఆ ఫోన్ కథ అంతా చెప్పినా విజయసాయిరెడ్డికి చిక్కులే ఏర్పడతాయి. అసలు ఫిర్యాదు ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా ఎందుకు డ్రామాడాలారు అన్నది ఇప్పుడు కీలకం.
అసలు డబ్బుల వ్యవహారాలు, సూట్ కేసు కంపెనీలు, మనీలాండరింగ్ ఇలాంటివన్నీ విజయసాయిరెడ్డి ప్రమేయం లేకుండా జరిగేలా కనిపించడం లేదు.ఆ గుట్టు అంతా ఆయన ఫోన్లలో ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా ఈ లావాదేవీలన్నీ విజయసాయిరెడ్డి ఫోన్ల నుంచి సాగినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఫోన్ పోయిందని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని డ్రామాలాడారు. ఇప్పుడు అసలు కథ వెలుగులోకి వస్తుందా..?