మోహన్ బాబు కుమారులు ఇద్దరూ టామ్ అండ్ జెర్రీని మించి పోట్లాడుకుంటున్నారు. మీదకు నలభై ఏళ్లు వచ్చేశాకా టామ్ అండ్ జెర్రీ ఆటలు ఆడితే అసహ్యంగా ఉంటుంది. విచిత్రంగా చెప్పుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మంచు మనోజ్ కు చెందిన ఇంటకి కరెంట్ సరఫరాను అస్తవ్యక్తం చేసేందుకు షార్ట్ సర్క్యూట్ జరిగేలా చేయడానికి ఇన్వర్టర్లో పంచదార పోసేశారు మంచు విష్ణు. ఇదేం ఐడియా మాస్టారూ అని ఇంటర్నెట్ మంచు విష్ణును ఓ రేంజ్ లో పాపులర్ చేస్తోంది.
మంచు మనోజ్ విష్ణు పంచదారను ప్రత్యేకంగా మనుషులతో తెప్పించిన వీడియోను రిలీజ్ చేశారు. ఇన్వర్టర్ దగ్గర పంచదార ఉన్న దృశ్యాలను రిలీజ్ చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తన తల్లి, భార్య, బిడ్డను కూడా చంపేందుకు ప్లాన్ చేశారన్నట్లుగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు కానీ ఎందుకో ఆగిపోయారు. భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఆళ్లగడ్డ వెళ్తున్నారు. వెళ్లే ముందు లేదా వెళ్లొచ్చినాక ఫిర్యాదు చేస్తానని ఆయన అంటున్నారు.
మనోజ్ ఫిర్యాదు చేసినా చేయకపోయినా.. ఇలాంటి పనులు చేసిన మంచు విష్ణు మాత్రం ఫేమస్ అవుతున్నారు. తాము చిన్న తనంలో ఇలాంటి పనులు చేశామని చాలా మంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇంత వయసొచ్చాక కూడా ఇలాంటి చిల్లర పనులు చేయడం ఏమిటని .. వారంతా పరోక్షంగానే సెటైర్లు వేస్తున్నారు. కారణం ఏదైనా ..మొత్తంగా మంచు మోహన్ బాబు కుమారుడు…. ప్రజలకు కావాల్సినంత ఎంటర్ టెయిన్మెంట్ ఇస్తున్నారు. సినిమాలు చేసి ఎంటర్టెయిన్మెంట్ ఇస్తే డబ్బులైనా వస్తాయి.. ఇలా చేస్తే పరువు పోతుందన్న విషయం గుర్తించలేకపోతున్నారు.