చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయంలో సమావేశం అయ్యారు. తన శాఖకు సంబంధించిన కీలక విషయాలతో పాటు రాజకీయ అంశాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా నాగబాబు ప్రమాణ స్వీకరతేదీని ఖరారు చేసే విషయంలో కీలక చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. మంచి రోజు చూసుకుని ఖరారు చేసుకోవాలని చంద్రబాబు సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.సంక్రాంతి తర్వాత ప్రమాణ స్వీకారం తేదీ ఉండే అవకాశం ఉంది. చాయిస్ పవన్ బ్రదర్స్ కే చంద్రబాబు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే నగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించబోతున్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు రాష్ట్రలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో పాల్గొనకుండా వైసీపీ బహిష్కరించడం త్వరలో సహకార సంఘాల ఎన్నికలు జరగనుండటంతో వాటిపైనా చర్చించినట్లుగా చెబుతున్నారు. సాగునీటి సహకార సంఘాల ఎన్నికల్లో జనసేన, బీజేపీకి ప్రాతినిధ్యం లభించింది.
అలాగే తన శాఖలకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలపైనా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనుల విషయంలో ఏర్పడిన ఆటంకాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అరగంటపాటు జరిగిన సమావేశంలో అధికారులు కూడా పాల్గొన్నారు.